Etela Rajender Press Meet: బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలపై ఎమ్మెల్యే రాజేందర్ మండిపడ్డారు. డబ్బులు లేక ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు సాధ్యం కాని హామీలను ఇస్తోందన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ సాధ్యం కాదన్నారు.
Telangana Politics: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే.. భార్యాభర్తలు ఇద్దరికీ వృద్ధాప్య పింఛన్ అందజేస్తామని హామీ ఇచ్చారు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఉన్నవారికి రైతుబంధు పథకం ఆపేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
Etela Rajender Open Challenge to CM KCR: రాష్ట్రంలో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఈటల రాజేందర్. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
Etela Rajender Car Accident: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక నుంచి ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.
Etela Rajender Counter To Minister KTR: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే సినిమా చూపిస్తారని అన్నారు. సినిమా చూపించేది నాయకులు కాదని.. ప్రజలేనని అన్నారు.
Etela Rajender Comments On CM KCR: సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. రైతుల భూములు లాక్కుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. రైతుల మీద జలగల్లాగా బతకవద్దన్నారు.
MLA Etela Rajender at Indira Park: సీఎం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు పాడుపడిపోతున్నాయని తప్ప.. వాటిని లబ్ధిదారులకు ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోడానికి నీ అబ్బ జాగీరా కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
Etela Rajender Fires On CM KCR: శామీర్‌పేట్‌లో రైతులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కలెక్టరేట్ ముందు ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైతులతో మాట్లాడి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
TS 10th Paper Leak Case Issue: పదో తరగతి పరీక్ష పేపర్ల వ్యవహారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం విచారణకు హాజరయ్యారు. పోలీసులకు తన ఫోన్ అందజేసిన ఆయన.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈటల ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌ను ఆయన ఓపెన్ చేయలేదని పోలీసులు గుర్తించారు.
MLA Etela Rajender On Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో ఆడవాళ్లు ఉంటారా అని గ్రామాల్లో మహిళలు అడుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వ్యాపారం చేసుకోవడానికి ఇదే దొరికిందా..? అని ఆయన ఫైర్ అయ్యారు. చట్టానికి సహకరించి.. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు.
Etela Rajender Comments On Preethi Death Case: డాక్టర్ ప్రీతిది వ్యవస్థ చేసిన హత్య అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుతున్నా.. సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వంటి విశ్వనగరంలో పట్టపగలే హత్యలు జరుతున్నాయన్నారు.
Etela Rajender On CM KCR: హుజూరాబాద్‌లో ప్రజలు ఓడించారని.. సీఎం కేసీఆర్ మానేరు నదిని చెరపట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పాలన కొనసాగడం పేదప్రజలకు అరిష్టమని.. మళ్లీ గెలిస్తే చావులు, అణచివేత, హింసించడం తప్పదని అన్నారు.
Etela Rajender: పథకం ప్రకారమే ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మాజీ నక్సలైట్లను కూడగట్టుకుని దాడులు చేయాలని పథకం వేస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
Munugode Bypoll:మునుగోడు మండలం పలివెల రణరంగంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఈటల కారు ధ్వంసం అయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో టీఆర్ఎస్ నేతలు కూడా గాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.