Brs win Over congress mahabubnagar mlc local bodies by elections 2024: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్ పార్కుకు వెళ్లి అమర వీరుల స్థూపం దగ్గరు నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క, తెలంగాణ మంత్రులు, ముఖ్య నాయకులు తెలంగాణ అమరువీరులకు సంతాపాన్ని తెలియజేశారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని, జాతీయజెండాను ఆవిష్కరించి, తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ప్రారంభించారు. అదే విధంగా పరేడ్ లో అధికారులు, పోలీసుల గౌరవ వందానాన్ని సీఎం రేవంత్ స్వీకరించారు.
Read more; Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..
ఇదిలా ఉండగా.. మరోవైపు మహబూబాబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలు వడ్డాయి. ఈ రిజల్ట్ పూర్తిగా కాంగ్రెకు పెద్ద దెబ్బగా మారింది. అధికారంలో ఉండి, సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో... కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి 111 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించినట్లు తెలుస్తోంది. నవీన్ కుమార్ రెడ్డి కు 763, జీవన్ రెడ్డికి 652 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఒక్క ఓటు పడినట్లు తెలుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఫలితం తెలిపోయింది.
మార్చి 28 వ తేదీన పోలింగ్ నిర్వహించగా, నేడు ఓట్ల లెక్కింపు జరిగింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం.. 1,439 మంది ఓటర్లు ఉండగా.. 1,437 మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కౌంటింగ్ కోసం మొత్తంగా ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి శాసనసభ ఎన్నికలలో కల్వకుర్తి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపునన పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఉప ఎన్నికల అనివార్యమైనట్లు తెలుస్తోంది..
స్పందించిన బీఆర్ఎస్ కేటీఆర్..
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన నవీర్ కుమార్ రెడ్డికి, కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో తమకు గెలుపు అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ గెలుపు మరిన్ని గెలుపులకు బాటలు వేయాలని కేటీఆర్ అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter