ఫెయిల్ భయం.. ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల భయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇద్దరు విద్యార్థినులు పరీక్షా ఫలితాల భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఫలితాలు రాకముందు ఒకరు చనిపోగా, పరీక్షలో ఫెయిలయ్యానన్న బాధతో మరో విద్యార్థిని తనువు చాలించింది.

Last Updated : Jun 19, 2020, 08:03 AM IST
ఫెయిల్ భయం.. ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు (Telangana Intermediate Results 2020) గురువారం (జూన్ 18న) విడుదలయ్యాయి. అయితే ఫలితాల భయం నేపథ్యంలో ఇద్దరు విద్యార్థినులు ఉరివేసుకుని ఆత్మహత్య (Inter Students Commits Suicide) చేసుకున్నారు. మెదక్ జిల్లా చేగుంట గ్రామానికి చెందిన కుర్ర రమేష్, పెంటమ్మల కుమార్తె శిల్ప (17) ఇంటర్ బైపీసీ ఫస్టియర్ పరీక్షలు రాసింది. గురువారం ఫలితాలు వస్తాయని, పరీక్షలో తప్పుతాననే భయంతో ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చెందింది. TS inter results 2020: తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్

సాయంత్రం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలలో శిల్ప ఓ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయింది. సిద్ధిపేట జిల్లాలోనూ విషాదం చోటుచేసుకుంది. గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రవళిక (17) అనే  విద్యార్థిని ఇంటర్ సెకండియర్ బైపీసీ పరీక్షలు రాసింది. గురువారం వచ్చిన ఫలితాలలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎగ్జామ్ ఫెయిల్ భయం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News