Telangana ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

Degree Online Services, Telangana (DOST) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో డిగ్రీ సీట్ల కేటాయింపు కోసం చేపట్టే దోస్త్ నోటిఫికేషన్ 2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24న ప్రారంభం కానుంది.

Last Updated : Aug 21, 2020, 02:34 PM IST

    తెలంగాణ ‘దోస్త్‌’ 2020 నోటిఫికేషన్‌ విడుదల..

  • యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’
  • ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
Telangana ‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం (ఆగస్టు 20) దోస్త్ (Degree Online Services, Telangana (DOST)) నోటిఫికేష‌న్‌ విడుద‌ల చేసింది. ఆగ‌స్టు 24 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ‌లోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది నోటిఫికేషన్ ఆలస్యమైంది. క్రికెటర్ విజయ్ శంకర్ ఎంగేజ్‌మెంట్ వేడుక Photos

‘దోస్త్’ (DOST Admission 2020) ద్వారా ఉస్మానియా, మహాత్మాగాంధీ, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుకు సీట్లను కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజుగా విద్యార్థులు రూ.200 చెల్లించి దోస్త్ లో రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.  దోస్త్ వెబ్‌సైట్ (DOST Website)

దోస్త్ నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు ఇవే.. (DOST Notification Important Dates):-

  • ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
  • సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్‌ చేయాలి
  • సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ
  • సెప్టెంబర్ 28న రెండో విడతలో డిగ్రీ సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
  • సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మూడో విడత వెబ్ ఆప్షన్ల ఇచ్చుకోవాలి
  • అక్టోబర్ 8న మూడో విడతలో విద్యార్థులకు డిగ్రీ సీట్ల కేటాయింపు  SSB Jobs 2020: ఎస్ఎస్‌బీలో 1,522 కానిస్టేబుల్ జాబ్స్

Trending News