డిసెంబర్‌ 12 నుంచి 17 వరకు టీఎస్‌పీఎస్సీ పరీక్షల షెడ్యూల్

డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల షెడ్యూల్

Last Updated : Dec 1, 2018, 07:40 PM IST
డిసెంబర్‌ 12 నుంచి 17 వరకు టీఎస్‌పీఎస్సీ పరీక్షల షెడ్యూల్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ (తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) డిసెంబర్ నెలలో నిర్వహించనున్న రాత పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ డెయిరీ మేనేజర్/మేనేజర్ గ్రేడ్ 2, మార్కెటింగ్ అసిస్టెంట్, మార్కెటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోలర్స్, ఫీల్డ్ సూపర్‌వైజర్స్, ప్రాసెసింగ్ సూపర్‌వైజర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్, బాయిలర్ ఆపరేటర్స్ గ్రేడ్ 2, ప్లాంట్ ఆపరేటర్స్ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు డిసెంబర్ 12 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ఈ ప్రకటనలో పేర్కొంది. 

ఉద్యోగాల వారీగా పరీక్షల తేదీల వివరాలను టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://tspsc.gov.in లో పొందుపర్చినట్టు టీఎస్‌పీఎస్సీ స్పష్టంచేసింది.

Trending News