TSPSC Group 1 2024 New Notification: తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసులను భర్తీ చేయడానికి కొత్తగా నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల గ్రూప్ 1 ఇప్పటికే అనేక పర్యాయాలు క్యాన్షిల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశారు.
గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1నోటిపికేషన్ రద్దు చేసిన, గంటల వ్యవధిలోనే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగును ఒక్కసారిగా షాకింగ్ కు గురిచేసింది. తాజాగా ప్రకటించిన గ్రూప్ 1 నోటిఫికేష్ లో 563 పోస్టులు ఉన్నాయి. వీటికి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వ తేదీ సాయంత్ర 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ లు తీసుకొనున్నారు.
మే లేదా జూన్ లలో ప్రిలిమినరీ, సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జాన్ ను నిర్వహిస్తామని షెడ్యూల్ ను టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అదే విధంగా పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలను టీఎస్పీఎస్సీ సైట్ లో అధికారులు అప్ డేట్ చేశారు. ఈ క్రమంలో నిరుద్యోగులు ఒకింత ఆశ్చర్యానికి గురౌతున్నారు.
Read More: Sreeleela: అయోమయంలో శ్రీలీల.. హీరోయిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి నో క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook