వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్

వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్

Last Updated : Oct 12, 2019, 07:30 PM IST
వారికి ఇక జీతాలు లేవు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: టిఎస్ఆర్టీసి సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు చెల్లించే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సమ్మెలో పాల్గొని ఆర్టీసికి, ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వారిని క్షమించేది లేదని.. వారికి జీతాలు ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం స్పష్టంచేశారు. విధుల్లో కొనసాగిన వారికి మాత్రం జీతాలు అందుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చట్ట విరుద్దంగా చేసిన సమ్మెను ప్రభుత్వం గుర్తించనందున వారికి జీతాలు చెల్లించడం కూడా కుదరదని అన్నారు. అంతేకాకుండా వారిని ఇక ఉద్యోగాల్లోకి తీసుకోబోమని కేసీఆర్ తేల్చిచెప్పారు. 

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల వైఖరి గురించి మాట్లాడుతూ.. వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. సమ్మె చేస్తున్న వారితో చర్చించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై శనివారం ఆయన ఆర్టీసీ ఉన్నతాధికారులను ప్రగతి భవన్‌‌కి పిలిపించుకుని సమీక్ష నిర్వహించారు. సమ్మె కాలంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కొత్త నియామకాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు.

Trending News