బస్ భవన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు

బస్ భవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

Updated: Oct 12, 2019, 01:16 PM IST
బస్ భవన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 8వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి మౌన ప్రదర్శనలో కూర్చున్నారు. అలాగే హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌ వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. దీంతో సమ్మె మరింత ఉధృతమైంది. అయితే, కార్మికుల ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బస్ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇదిలావుంటే, ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతలు ఇవాళ మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.