Twins Veena Vani: ఫస్ట్ క్లాస్ లో ఇంటర్ పాసైన వీణ వాణి.. చాటెడ్ అకౌంటెంట్ కావడమే అవిభక్త కవల లక్ష్యమట!

Twins Veena Vani: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్ గా నిలిచారు.  అవిభక్త కవలలైన వీణ –వాణిలు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు.

Written by - Srisailam | Last Updated : Jun 28, 2022, 05:24 PM IST
Twins Veena Vani: ఫస్ట్ క్లాస్ లో ఇంటర్ పాసైన వీణ వాణి.. చాటెడ్ అకౌంటెంట్ కావడమే అవిభక్త కవల లక్ష్యమట!

Twins Veena Vani: తెలంగాణలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేశారు. ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్ గా నిలిచారు.  అవిభక్త కవలలైన వీణ –వాణిలు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. వీణ 712 మార్కులు సాధించగా... వాణి 707 మార్కులు సాధించింది. ఇంటర్ లో ఫస్ట్ క్లాస్ లో పాసైన వీణ వాణిలను  గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  అభినందించారు. వీణవాణి లు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు. భవిష్యత్తులో వారికి అవసరమై అన్నిసదుపాయాలు అందిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. వీణ వాణిలకు సహకారం అందించిన అధికారులను మంత్రి అభినందించారు.

వీణ వాణీలది మహబూబ్ బాద్ జిల్లా. 2003 సంవత్సరంలో మురళి, నాగలక్ష్మి దంపతులకు  తలలు అతుక్కుని కవలలుగా పుట్టారు. చికిత్స కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటి నుంచి 12 ఏళ్ల వరకు నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నారు. 12ఏళ్ల వయసు దాటిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కవలలను స్టేట్‌ హోమ్‌కు తరలించారు.వీణ వాణీలను విడదీయాలనే ఎంతగానే ప్రయత్నించినా వైద్యులు సఫలం కాలేదు.ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వీణ-వాణి కవలలకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఈ పరీక్షల్లో  ప్రధమ శ్రేణిలో పాసై అందరికి ఆదర్శంగా నిలిచారు అవిభక్త కవలలు. చాటెడ్ అకౌంట్స్ చదవాలన్నది తమ లక్ష్యమని గతంలో వీణ వాణి తెలిపారు.

Read also: ఇంటర్‌లో ఫెయిల్ అయినా, తక్కువ మార్కులు వచ్చినా.. టెన్షన్ అవసరం లేదు! ఇలా చేస్తే..

Read also: Nithya Menon Leg Fracture: నిత్యమీనన్ కు గాయాలు.. నడవలేని స్థితిలో హీరోయిన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News