Errabelli On Sarpanch: నిధులు రావడం లేదంటూ తెలంగాణ రాష్ట్రంలోని పలు గ్రామాల సర్పంచ్ లు మీడియాకెక్కడంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాల్సింది కేంద్రమే అని స్పష్టం చేశారు. ఈ విషయం అర్థంకానీ కొందరు సర్పంచులు రోడ్ల మీదకు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులకు సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. అయితే కేంద్రం మాత్రం నిధులు కేటాయించకుండా కావాలనే తాత్సరం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం వల్లే సమస్య తీవ్రతరం అవుతుందన్నారు. ఆ సమస్య పరిష్కరించేందుకు మంత్రులం, అధికారులు కూడా కృషి చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు తేల్చిచెప్పారు. త్వరలోనే కేంద్రం నుంచి పెండింగ్ బిల్లులను తెప్పిస్తామని స్పష్టం చేశారు. అప్పటివరకు సర్పంచ్‌లు సంయమనం పాటించాలని కోరారు.
తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పలు అంశాలపై తీర్మానాలు చేశారు. కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలన్నారు. ఈ నిధుల్లో కోత విధించకుండా, గత ట్రాక్ రికార్డు ఆధారంగా రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పనిదినాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్బన్ ప్రాంతాల్లోనూ ఉపాధిహామీ పనులు చేసుకునే వీలు కల్పించాలన్నారు. గతంలోమాదిరిగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా పేమెంట్స్ ఇవ్వాలన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి బకాయిలుగా ఉన్న 97 కోట్ల 35 లక్షల రూపాయాలను వెంటనే చెల్లించాలన్నారు. ఇక కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వచ్చిన వార్తను మంత్రి ఎర్రబెల్లి ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. 3 లక్షల 50 వేలు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నప్పటికీ అది వాస్తవం కాదన్నారు. పని జరిగే ప్రదేశాల ఫోటోలు పెట్టాలని కేంద్రం కొత్త రూల్ పెడుతుందని ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోగా, రాష్ట్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. అవగాహన లేకుండా బండి సంజయ్ లాంటి నేతలు మాట్లాడటం దారుణమన్నారు.
Also Read: BANDI SANJAY FIRE ON KCR : 'కేసీఆర్‌ను ఎక్కడికక్కడ నిలదీస్తాం'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.