కేసీఆర్ పిలిచే రాహుల్ ఎవరు..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ కరోనా వైరస్ పుణ్యమా .. అని తరచుగా తెలంగాణలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కేబినెట్ నిర్ణయించిన విషయాలను మీడియాకు వివరిస్తున్నారు. కాబట్టి తరచుగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారు.

Last Updated : May 20, 2020, 11:36 AM IST
కేసీఆర్ పిలిచే రాహుల్ ఎవరు..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ కరోనా వైరస్ పుణ్యమా .. అని తరచుగా తెలంగాణలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కేబినెట్ నిర్ణయించిన విషయాలను మీడియాకు వివరిస్తున్నారు. కాబట్టి తరచుగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారు.

ఇదిలా ఉంచితే.. ఈ మధ్య సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఎక్కువగా ఓ పేరు వినిపిస్తోంది. ఆయన ఎప్పుడూ 'రాహుల్' అనే పేరుతో ఓ వ్యక్తిని సంబోధిస్తున్నారు. ఐతే ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఇంతకూ ఈ రాహుల్ అనే వ్యక్తి ఎవరు..? అని నెటిజనులు తెగ ప్రశ్నిస్తున్నారు. 

అసలు 'రాహుల్' అనే వ్యక్తి ఉన్నారా..? సీఎం కేసీఆర్ ఏ జర్నలిస్టునైనా సరే  పిలవడానికి 'రాహుల్' అనే పేరు వాడుతున్నారా..? అనే చర్చలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన ఈ 'రాహుల్' అనే పేరుకు సంబంధించి ఓ ఫోటో కూడా వైరల్ అయింది. దేవులపల్లి రాహుల్ అనే ఓ యువ జర్నలిస్టు ఫోటోను నెటిజనులు వైరల్ చేశారు. కానీ సీఎం ప్రెస్ మీట్‌కు ఆ యువ జర్నలిస్టు ఎప్పుడూ హాజరు కాలేదు. దీంతో సీఎం కేసీఆర్ పిలిచే రాహుల్‌కు ఆ యువ జర్నలిస్టుకు సంబంధం లేదని తేలిపోయింది. దీంతో ఇప్పుడు 'రాహుల్' అంటే ఎవరు..? అనే చర్చ మళ్లీ మొదలైంది. 

ఐతే సీఎం కేసీఆర్ మీడియా సమావేశానికి హాజరయ్యే 'రాహుల్' ఓ సీనియర్ జర్నలిస్టు. చాలా కాలంగా  ఆయన హిందూ దినపత్రికలో పని చేస్తున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. సీఎం కేసీఆర్ కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటారు. మంచి స్నేహం ఉన్న కారణంగానే  ఎప్పుడూ ఆయన్ను ఉద్దేశించి 'రాహుల్ ఎందుకయ్యా ఇదంతా..?' 'రాహుల్... ఇది నువ్ కచ్చితంగా రాయాలి..!' 'రాహుల్ .. యూ ఆర్ సచ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ ఇలా మాట్లాడొచ్చా..' అంటూ మాట్లాడుతుంటారు కేసీఆర్. 

సీఎం కేసీఆర్ ఎప్పుడూ పిలుస్తుండడంతో సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయారు. కానీ  ఆయన ఎవరు..? ఎలా ఉంటారనేది నెటిజనులకు తెలియదు.  ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే రాహుల్. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News