Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి పిటిషన్ వేయడంతో జువైనల్ కోర్టు విచారించింది.
Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నలుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు జువైనల్ కోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను రెండుసార్లు కోర్టు తిరస్కరించింది. తాజాగా మరోసారి పిటిషన్ వేయడంతో జువైనల్ కోర్టు విచారించింది. ఐతే ఎమ్మెల్యే కుమారుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ధర్మాసనంలో బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇదే కేసులో నిందితుడు మాలిక్ బెయిల్ పిటిషన్‌ను జువైనల్ కోర్టు తిరస్కరించింది. మరోవైపు జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. మొత్తం 420 పేజీలతో ఛార్జీషీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీషీట్‌లో సాదుద్దీన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు పోలీసులు.