kancha ilaiah: ఎంతకు తెగించాడ్రా..?.. తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్..

Tirumala lord Balaji: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిది వివాదంగా మారినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 24, 2024, 11:12 AM IST
  • తిరుమలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రొఫెసర్..
  • చర్యలు తీసుకొవాలంటున్న శ్రీవారి భక్తులు..
kancha ilaiah: ఎంతకు తెగించాడ్రా..?.. తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్..

kancha ilaiah controversy comments on Tirumala lord Balaji: ఇటీవల కాలంలో పవిత్రమైన తిరుమలను చాలా మంది వివాదాల్లోకి లాగుతున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తిరుమల లడ్డు వివాదం, ఆ తర్వాత తిరుమలలో రీల్స్, ఫోటో షూట్ లు కూడా పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సైతం.. ఈ ఘటనలపై సీరియస్ అయ్యారు.

Add Zee News as a Preferred Source

కొన్ని రోజుల క్రితం తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం.. తిరుమలలో తెలంగాణ వారిపట్ల వివక్షతకు చూపిస్తున్నారని కూడా వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాజాగా.. మరోసారి తిరుమల శ్రీవారిపై కంచె ఐలయ్య వివాదస్పదంగా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా శ్రీవారి భక్తులు సీరియస్ అయినట్లు తెలుస్తొంది.

ప్రొఫెసర్ ఐలయ్య ఇటీవల మ‌హ‌బుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్ర‌హావిష్క‌ర‌ణకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అక్కడ దొడ్డికొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. మ‌హిళా విశ్వ‌విద్యాల‌యానికి తెలంగాణ ప్ర‌భుత్వం చాక‌లి ఐల‌మ్మ పేరు పెట్ట‌డం త‌ప్పేమీ కాదన్నారు. ఆమె యోధురాలని, తెలంగాణలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.

అదే సమయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లు యూనీవర్సీటీలకు ఎందుకటి.. వారికి ఏమైన చదువొచ్చా.. ఏదైన సంఘ సంస్కరణ పనులు చేశారా.. అంటూ నోటీకోచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈ ఘటన కాస్త వివాదం రాజేసిందని చెప్పుకొవచ్చు. దీనిపై శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారంట.

Read more: Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..

వెంటనే ప్రొఫెసర్ ఐలయ్యపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారంట.  గతంలో.. కంచె ఐలయ్య..రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు.. కోమ‌టోళ్లు అనే బుక్ తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారితీసిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం కంచె ఐలయ్య మరోవివాదంను రాజేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News