Viral Video: తిరుపతిలో ఘోర అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ... షాకింగ్ వీడియో వైరల్..

Tallapaka Annamacharya statue: పవిత్రమైన తిరుపతిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న అన్నమయ్య విగ్రహాంకు గుర్తు తెలియని ఆగంతకులు శాంతా క్లాజ్ టోపీని పెట్టారు. ఈ ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 24, 2024, 01:37 PM IST
  • తిరుమలలో మరో వివాదం..
  • చర్యలు తీసుకొవాలని హిందు సంఘాల డిమాండ్..
Viral Video: తిరుపతిలో ఘోర అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ... షాకింగ్ వీడియో వైరల్..

unknown persons puts santa claus hat on tallapaka annamacharya statue in Tirupati: ఆధ్యాత్మిక నగరమైన తిరుమలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీ వారిని భక్తులు కొంగు బంగారంగా భావిస్తారు. కానీ ఇటీవల తిరుమల అనేక వివాదస్పద  అంశాలతో తరచుగా వార్తలలో ఉంటుందని చెప్పుకొవచ్చు. ఇటీవల కూటమి సర్కారు కూడా తిరుమలకు పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.

Add Zee News as a Preferred Source

 

ఈ మధ్యనే కొత్తగా పాలక మండలిని సైతం ఏర్పాటు చేశారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడిన, మాడవీధుల్లో రీల్స్, వీడియోలు తీస్తు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కేసులను పెట్టేందుక సైతం వెనుకాడబోమని .. టీటీడీ కొత్త చైర్మన్ బీఎస్ నాయుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో తిరుపతి నగరం నడి బొడ్డున షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 

తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టినట్లు తెలుస్తొంది.. దీనిపై స్థానికులు తమ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి హిందు సంఘాలు చేరుకున్నాయి. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొంత మంది కులాల చిచ్చు రాజేసేందుకు చూస్తున్నారని అక్కడి వారు ఈ ఘటనను ఖండిస్తున్నారు. 

Read more: Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..

తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శాంతాక్లాజ్ టోపీ పెట్టిన  ఘటన పెనుదుమారంగా మారింది. ప్రస్తుతం హిందు సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసనలు తెలియజేస్తున్నాయి.  రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News