Munnooru Ravi at TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో మున్నూరు రవి.. వీడియో వైరల్

Munnooru Ravi in TRS Plenary: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలోో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మర్డర్ అటెంప్ట్ కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి దర్శనం ఇచ్చాడు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీతో పాటు మున్నూరు రవి కూడా మరోసారి వార్తల్లో నిలిచాడు.

  • Zee Media Bureau
  • Apr 28, 2022, 04:31 PM IST

Munnooru Ravi at TRS Plenary meeting 2022 : టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో మున్నూరు రవి ఎంట్రీ ఇవ్వడం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనేే కాదు.. మొత్తం రాజకీయవర్గాల్లోనూ చర్చనియాంశమైంది. ఇంతకీ ఈ మున్నూరు రవి ఎవరు, ఆయన టీఆర్ఎస్ ప్లీనరీకి వచ్చినంత మాత్రాన్నే అంత హాట్ టాపిక్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా ? అయితే, ఇదిగో ఈ వీడియో చూస్తే మొత్తం సీన్ మీకే అర్థమైపోతుంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఇటీవల కొన్ని వార్తలు పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తే ఈ మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి, మున్నూరు రవికి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలొచ్చాయి. అందులోనూ టీఆర్ఎస్ ప్లీనరీకి పార్టీకి చెందిన ఎంతో ముఖ్యులైన 3 వేల మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయి. మరి మున్నూరు రవికి కూడా పార్టీ నుంచి ప్లీనరీకి ఆహ్వానం అందిందా ? లేక మున్నూరు రవే చొరవ తీసుకుని మరెవరి పాస్‌పైనైనా టీఆర్ఎస్ ప్లీనరీకి వెళ్లాడా ? టీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది ?  

Video ThumbnailPlay icon

Trending News