No Petrol: మనిషి జీవితంలో పెట్రోల్ నిత్యావసరంగా మారింది. బతుకు జట్కా బండి ముందుకు వెళ్లాలంటే చమురు అవసరం ఉంది. ఐతే రాబోయే పరిస్థితి మారబోతోందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతున్నారు.
No Petrol: దేశంలో రూ.120 రూపాయలు పెడితేగానీ పెట్రోల్ దొరకడం లేదు. ఇటీవల చమురుపై పన్ను తగ్గించడంతో దేశవ్యాప్తంగా రూ.9 మేర పెట్రోల్ ధర తగ్గింది. ఈక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ వాడకం ఉండదన్నారు. వచ్చే ఐదేళ్లలో కరెంట్ ఉపయోగం పెరుగుతుందని పరోక్షంగా చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరెంట్ వాహనాల వాడకం పెరుగుతున్నాయి.