Add Zee Business As A Preferred Source
App

అహ్మెదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో అహ్మెదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్‌ని ఆత్మీయ ఆలింగనం చేసుకుని మిత్రుడికి సాదర స్వాగతం పలికారు. ట్రంప్ సతీమణి మెళానియా ట్రంప్‌కు చేయి చాయి షేక్ హ్యాండ్ ఇచ్చి భారత గడ్డపైకి స్వాగతించారు. అనంతరం విమానాశ్రయంలో ఆయన రాకకోసం వేచిచూస్తున్న భారత ప్రతినిధుల బృందాన్ని ప్రధాని మోదీ ఆయనకు పరిచయం చేస్తూ వెళ్లారు. అక్కడి నుంచి ట్రంప్ తన బీస్ట్ కారు ఎక్కి కూర్చోగా.. ప్రధాని మోదీ తన కాన్వాయ్‌లో రోడ్ షోగా బయల్దేరారు.

Recommended Videos