YS Sharmila Slams CM KCR: కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలుంటే బీజేపి ఏం చేస్తోంది : వైఎస్ షర్మిల

YS Sharmila comments on CM KCR: సీఎం కేసీఆర్ ముమ్మాటికి మోసగాడేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో 110వ రోజైన గురువారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల.. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలన్ని తుంగలో తొక్కాడని మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Jun 30, 2022, 09:05 PM IST

YS Sharmila comments on CM KCR: సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని కేసీఆర్ ముమ్మాటికీ మోసగాడేనని మండిపడ్డారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అధికార పార్టీ చంకనెక్కాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్‌కి అమ్ముడుపోవడం రాజకీయ వ్యభిచారం కాదా అని నిలదీశారు. బీజేపి మాత్రం తక్కువా చేసిందా అని ప్రశ్నించిన వైఎస్ షర్మిల.. కేసీఆర్‌ అవినీతిపై ఆధారాలుంటే బీజేపి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని బీజేపిపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ షర్మిల ఇంకా ఏమన్నారంటే..
 

Video ThumbnailPlay icon

Trending News