Rajinikanth: బద్రీనాథుని సేవలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, వీడియో వైరల్‌

Rajinikanth: జైలర్ మూవీతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న రజనీకాంత్.. శనివారం బద్రీనాథీశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అభిమానులతో ముచ్చటించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2023, 02:25 PM IST
Rajinikanth:  బద్రీనాథుని సేవలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, వీడియో వైరల్‌

Rajinikanth visits Badrinath Temple: 'జైలర్‌' సినిమా రిలీజ్ కు ముందే హిమాలయాలకు బయలుదేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. శనివారం బద్రీనాథీశ్వరుడిని దర్శించుకున్నారు. అంతేకాకుండా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. లైట్‌ బ్లూ స్వెటర్‌లో ఆలయానికి వచ్చిన సూపర్ స్టార్ తో ఫ్యాన్స్ ఎగబడి మరి ఫోటీలు దిగారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని కూడా శనివారం రజనీ సందర్శించారు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని స్వామిజీ తనతో చెప్పారని రజనీ అన్నారు. 

రజనీకాంత్‌-నెల్సన్‌ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) కాంబోలో వచ్చిన జైలర్‌’ (Jailer) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో రూ.200 కోట్ల వసూలు చేసింది.ఈ చిత్రంలో ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండ్యన్ అనే రిటైర్డ్ పోలీస్ అధికారి పాత్రలో రజినీ నటించి మెప్పించారు. ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజకుమార్, జాకీ ష్రాప్, సునీల్, ప్రియాంక అరుళ్‌మోహన్‌ తదితరుల కీ రోల్స్ పోషించారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అయింది. ముఖ్యంగా రావాలయ్య సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. ఉన్నది కొన్ని నిమిషాలే అయిన శివన్న నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 

రజినీ చాలా ఏళ్ల తర్వాత హిట్ కొట్టాడు. గతంలో వచ్చిన ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ సినిమాలు బాగానే ఆడినప్పటికీ కలెక్షన్లు రాబట్టడంలో విఫలమయ్యాయి. గతేడాది వచ్చిన పెద్దన్న డిజాస్టర్ గా నిలిచింది. దీంతో రజనీపై విమర్శలు పెరిగాయి. తాజాగా జైలర్ హిట్ తో వారందరి నోళ్లను మూయించినట్లయింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. రజనీ ఇదే జోరు కొనసాగిస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవుతాయి. మరో రెండు రోజుల్లో ఇండిపెండెన్స్‌ డే కూడా రానుండటంతో ఈ మూవీ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. 

Also Read: Saindhav Movie: థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. వెంకటేష్ 'సైంధవ్‌' నుంచి క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News