Ram Temple: అమెరికాలో అయోధ్య రామయ్య వెలుగులు

అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ  ( Ram temple bhoomi pujan ) చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం కలిగిన అతి పెద్ద దేశంగా పేరొందిన భారత్‌లో చోటుచేసుకున్న ఈ మహా ఘట్టాన్ని కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది.

Last Updated : Aug 5, 2020, 11:28 PM IST
Ram Temple: అమెరికాలో అయోధ్య రామయ్య వెలుగులు

న్యూయార్క్: అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ  ( Ram temple bhoomi pujan ) చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం కలిగిన అతి పెద్ద దేశంగా పేరొందిన భారత్‌లో చోటుచేసుకున్న ఈ మహా ఘట్టాన్ని కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. అందుకు ఉదాహరణగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్‌లో రామ మందిరం ప్రతిమ 3D లైట్ల కాంతుల్లో దేదీప్యమానంగా వెలగడం విశేషం. అయోధ్యలో భూమి పూజ సందర్భంగా భారత్‌కి ఇది అమెరికా ఇచ్చిన గౌరవంగా భావించవచ్చు. Also read: Ram temple: రామ మందిరం కోసం 28 ఏళ్లుగా మరో శబరి ఉపవాసం

#WATCH USA: A digital billboard of #RamMandir comes up in New York’s Times Square.

Prime Minister Narendra Modi performed 'Bhoomi Pujan' of #RamMandir in Ayodhya, Uttar Pradesh earlier today. pic.twitter.com/Gq4Gi2kfvR

— ANI (@ANI) August 5, 2020

 

టైమ్ స్క్వేర్‌లో ( Times Square in New York ) ప్రత్యక్షమైన ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. అమెరికాలో ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భారతీయులు జై శ్రీరామ్ అంటూ భక్తిపారవశ్యంతో చేసిన స్లోగన్స్‌ని ఈ వీడియోలో చూడొచ్చు. Also read: Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు

IPL 2020: ఐపిఎల్ 2020లో అన్నీ సవాళ్లే: సురేష్ రైనా

 

Trending News