నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. రజనీకాంత్ డైలాగ్ గుర్తుంది కదా. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఈ డైలాగ్ గుర్తొచ్చినట్టుంది. ఆయన షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump) కు ఏమైందో తెలియదు. ఓ వీడియో షేర్ చేసి సంచలనం రేపారు. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏదో చెప్పరాని సందేశాన్ని చెబుతోంది. మరోవైపు ఆ వీడియా రికార్డు స్థాయి వ్యూస్ సాధించి దుమ్ము రేపుతోంది. ట్విట్టర్ వేదికగా ట్రంప్ షేర్ చేసిన ఆ వీడియో 2.2 మిలియన్ వ్యూస్ సాధించింది. నవంబర్ 22న డాన్ స్కావినో అనే ట్విట్టర్ ( Twitter ) యూజర్ షేర్ చేసిన వీడియోను ట్రంప్ షేర్ చేశారు.
ఈ వీడియో సింహం, హైనాల ( Lion and hyenas ) కు సంబంధించినది. ఈ వీడియోలో సింహం ఓ చిన్న నీటి కొలను దాటుకుని గుంపులుగా ఉన్న హైనాల వద్దకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న సింహాన్ని చూసి ఆ హైనాలన్నీ కలిసి దాడికి ప్రయత్నిస్తాయి. సింహ వాటితో పోరాడినా...దాడి తీవ్రమౌతుంటుంది. ఇంతలో మరో సింహం అటుగా వచ్చి రంగంలో దిగుతుంది. రెండు సింహాలు చేరేసరికి..హైనాలు పారిపోతాయి. వీడియోలో ఇంతవరకే ఉంది. తరువాత ఏం జరిగిందనేది లేదు. హైనాల్ని సింహాలు తరువాత వేటాడాయా లేదా అనేది క్లారిటీ లేదు. ట్రంప్ మాత్రం ఇది చాలా నిజం అంటూ కామెంట్ చేశారు.
So much truth! https://t.co/KGBQDEPEkV
— Donald J. Trump (@realDonaldTrump) November 27, 2020
ఈ కామెంట్ వెనుక ట్రంప్ ఉద్దేశ్యమేంటో అర్ధం కావడం లేదు. నెటిజన్లు మాత్రం రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. తనను తాను సింహంతో పోల్చుకుంటున్నారా లేదా రజనీకాంత్ ( Rajnikanth ) సినిమా డైలాగ్ గుర్తు తెచ్చుకున్నారా అని అంటున్నారు. Also read: Mount Everest Height: ఎవరెస్టు శిఖరం ఎత్తు మారింది..త్వరలో అధికారిక ప్రకటన