H1B Visa: హెచ్1బి వీసా రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్త. ఇండియాకు రాకుండా అక్కడ్నించే వీసా రెన్యువల్ చేయించుకోవచ్చు. హెచ్ 1బి వీసా పునరుద్ధరణకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
హెచ్ 1 బీ వీసా రెన్యువల్ చేయించాలంటే ఇండియా రావల్సి వచ్చేది. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. దాంతో అమెరికాలో వీసా రెన్యువల్ ప్రక్రియ కొనసాగాలనేది భారతీయలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయల కోసం హెచ్ 1బీ వీసా రెన్యువల్ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ఇక అందరికీ రెన్యువల్ చేసేందుకు ఆమోదం తెలిపింది. హెచ్ 1 బి వీసా రెన్యువల్ కార్యక్రమం ఈ ఏడాదిలో జరగవచ్చు. ఇది అమల్లోకి వస్తే వివిధ రకాల టెక్ నిపుణులు, భారతీయులకు పెద్దఎత్తున ప్రయోజనం కలగనుంది. గతంలో అయితే వీసా రెన్యువల్ కోసం ఇండియాకు రావల్సిన పరిస్థితి ఉండేది.
ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ఇక అందరికీ వీసా రెన్యువల్ అమెరికాలోనే జరగనుంది. వీసా రెన్యువల్ నిర్ణయాన్ని బిడెన్ ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్ట్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇంకా మూడు వారాల సమయం ఉంది. జనవలి 20న ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో హెచ్ 1 బి వీసా రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం గమనార్హం.
Also read: Delhi Elections: కేంద్ర బడ్జెట్‌పై ఎన్నికల కమీషన్ ఆంక్షలు, ఢిల్లీని బడ్జెట్ నుంచి మినహాయించాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.