పాదచారులపైకి వ్యాను దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ దుర్ఘటన జర్మనీలోని మునెస్టర్ ప్రాంతంలో జరిగింది. మునెస్టర్ లో అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో వ్యాను బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన వ్యాను పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ సంఘటనను ఉగ్ర చర్యగా పోలీసులు భావిస్తున్నారు.ఘటన అనంతరం వ్యాను డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పశ్చిమ జర్మనీలోని మునెస్టర్..ప్రముఖ పర్యాటక ప్రదేశం. శనివారం పాత నగరంలోని రెస్టారెంట్లో కొదరు వ్యక్తులు కూర్చొని ఉన్న సమయంలో వాహనం దూసుకొచ్చింది. అక్కడి వారు ఆర్తనాదాలు చేసుకుంటూ చెదిరిపోయారు. కాగా వాహనం కింద నలిగిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆతరువాత కొద్దిసేపటికే డ్రైవరు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలోనూ ఉగ్రవాదులు వాహనాలతో దాడులకు పాల్పడి తీవ్ర ప్రాణ నష్టం కలిగించడంతో తాజా ఘటన కూడా ఉగ్ర చర్యగానే భావిస్తున్నారు పోలీసులు. అయితే, పోలీసులకు ఈ అనుమానాన్ని బలపరిచే ఆధారాలు దొరక్కపోవడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.