ఒబామా ప్రేమ సందేశం..!

Last Updated : Oct 4, 2017, 04:45 PM IST
ఒబామా ప్రేమ సందేశం..!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వివాహా వార్షికోత్సవం సందర్బంగా ఆయన భార్యకు ఒక అనుకోని ప్రేమ సందేశమిచ్చి ఆశ్చర్యపరిచారు. ఒబామా భార్య మిచెల్ ఒక మీటింగ్‌లో ఉండగా, ఒక ప్లాన్ ప్రకారం తన ప్రేమ సందేశంతో కూడిన వీడియోను అక్కడ ఆమెకు చేరేలా చేసి, తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. పెన్సిల్వేనియాలోని మహిళల కాన్ఫరెన్సులో ఉన్న మిచెల్, తమ సబ్జె్క్టుకు సంబంధించిన ఒక వీడియోను ఆసక్తిగా చూస్తుండగా సడెన్‌గా అందులో ఒబామా ప్రత్యక్షం కావడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఆ వీడియోలో బరాక్ ఒబామా మాట్లాడుతూ "హాయ్ హనీ... ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు  ఇక్కడ ఎందరో ముఖ్యమైన పెన్సిల్వేనియా మహిళలతో పాటు మన స్నేహితురాలు షోండా రైమ్స్‌తో కలిసి ఒక ముఖ్యమైన చర్చలో ఉన్నావు. కానీ మీ పార్టీని నేను క్రాష్ చేయక తప్పదు. ఎందుకంటే ఈ రోజుకి మన వివాహం జరిగి దాదాపు 25 సంవత్సరాలైంది. నాతో పాటు ఒక శతాబ్దం పాటు పయనించి నా జీవితంలో ఒక దైవికమైన, అద్భుతమైన, ఓర్పుగల మహిళగా చేయూతనందించావు. నువ్వు ఒక గొప్ప భాగస్వామిని మాత్రమే కాదు.. ఒక గొప్ప స్నేహితురాలివి కూడా..నన్ను నవ్వించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించే నువ్వు.. నా ఆలోచనలు సరైనివే అని నాకు మద్దతుగా నిలిచే నువ్వు.. నాకే కాదు మన కూతుళ్ళకూ.. మన దేశానికి కూడా ఆదర్శంగా నిలిచావు".

"నీ బలం, నీ ఆత్మ స్థైర్యం, నీ చతురత, నీ నిజాయితీ.. వీటన్నింటితో పాటు కొన్ని విషయాల్లో నీవు తీసుకొనే నైతిక బాధ్యత.. ఇవ్వన్నీ ప్రశంసించదిగినవే. నాలాగే నీ గురించి తెలుసుకొని, నీతో పరిచయం పెంచుకొనే వ్యక్తులు..నేనెంతలా నీతో ప్రేమలో పడిపోయానో.. అంతే గొప్పగా నీతో ప్రేమలో పడిపోతారనడంలో సందేహం లేదు. నీతో కలిసి ప్రయాణం చేయడం అనేది నేను తీసుకున్న గొప్ప నిర్ణయమే అని భావిస్తూ.. నిన్ను డేట్‌కు తీసుకెళ్ళినప్పుడు నీ నుండి కూడా నా పట్ల అదే భావాన్ని చూడడం జరిగింది. సరే...ఇప్పుడు ఆసక్తికరంగా సాగిపోతున్న  నీ చర్చ మధ్యలో నేను నిన్ను ఇబ్బందికి గురి చెయ్యను. కేవలం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మరియు నిన్ను ఎంతలా ప్రశంసించగలనో చెప్పడానికి ఈ మార్గాన్ని ఎన్నుకోవలసి వచ్చింది. అలాగే.. నీతో పాటు నేను చెప్పినదంతా విన్నా నీ తోటి మహిళలకూ నా ధన్యవాదాలు.. బై బై" అని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు ఒబామా. ఈ ప్రసంగాన్ని విన్న మిచెల్ "ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళడమే మంచిదేమో..!" అనడం కొసమెరుపు. ఆ సంఘటన జరిగిన తర్వాత మిచెల్, ఐ లవ్ యూ చెబుతూ మరో ట్వీట్ చేయడం విశేషం.<

 

Trending News