Izrael: ఇజ్రాయిల్ దేశానికి ఎట్టకేలకు మెజార్టీ ప్రభుత్వం ఏర్పడింది. లికుడ్ ప్రభుత్వం దిగిపోయి...యామినా ప్రభుత్వం ఏర్పడింది. నెతన్యాహూ పదవీచ్యుతుడు కాగా..కొత్త ప్రధానిగా బెన్నెట్ ఎన్నికయ్యారు.
ఇజ్రాయిల్ దేశంలో (Izrael) గత రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఏ ఒక్క పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రెండేళ్ల వ్యవధిలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. లికుడ్ ప్రభుత్వం పడిపోవడంతో 12 ఏళ్లపాటు ఇజ్రాయిల్ ప్రధానిగా కొనసాగిన బెంజమిన్ నెతన్యాహూ (Benjamin Netenyahu) పదవీచ్యుతుడయ్యారు. సాధారణ మెజార్టీ 61 స్థానాలతో యామినీ పార్టీ అధ్యక్షుడు బెన్నెట్ కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. సాధారణ మెజార్టీ వచ్చినా..పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు, భావజాలాలతో కూడిన 8 పార్టీల సంకీర్ణ కూటమికి బెన్నెట్ నేతృత్వం వహిస్తుండటం..మరోసారి ప్రభుత్వం పడిపోదనడానికి ఆస్కారం లేకుండా పోయింది.
నెతన్యాహూ పార్టీకు కేవలం 30 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.నెతన్యాహూ మెజార్టీ కూడగట్టలేకపోవడంతో రెండవ అతిపెద్ద పార్టీగా 17 సీట్లు సాధించిన పార్టీ అధినేత లాపిడ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం అందింది. లాపిడ్, బెన్నెట్ మధ్య జరిగిన ఒప్పందం మేరకు ముందుగా బెన్నెట్ ప్రధానిగా (Bennett as Izrael Prime minister) రెండేళ్లపాటు కొనసాగనున్నారు. 2023లో లాపిడ్ ప్రధానిగా ఎన్నికవుతారు. మంత్రివర్గంలో ప్రస్తుతం 27మంది మంత్రులున్నారు. 8 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ( Eight parties alliance) ఎన్నాళ్లు కొనసాగుతుందనేది ఆనుమానంగానే ఉంది.
Also read: G-7 Summit: ముగిసిన జీ-7 దేశాల సదస్సు, కీలక నిర్ణయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook