చైనాలో జి4 వైరస్ కలకలం..

చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. స్వైన్ ఫ్లూ కంటే డేంజర్ వైరస్‌గా జి4 అని నిపుణులు వెల్లడించారు. మనుషులకు తేలికగా సోకే లక్షణాలు జి4 వైరస్ ‌కు ఉన్నాయని చైనా ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.

Updated: Jun 30, 2020, 07:35 PM IST
చైనాలో జి4 వైరస్ కలకలం..

బీజింగ్: చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. స్వైన్ ఫ్లూ కంటే డేంజర్ వైరస్‌గా జి4 అని నిపుణులు వెల్లడించారు. మనుషులకు తేలికగా సోకే లక్షణాలు జి4 వైరస్ ‌కు ఉన్నాయని చైనా ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. చైనా జనాభాలో 4.4 శాతం మందికి జి4 వైరస్ సోకిందన్నారు. 2011 నుంచి 2018 వరకు పది ప్రావిన్స్‌లలో పందుల నుంచి 30 వేల స్పామ్స్ తీసుకొని పరిశోధన చేశారు. 
 Also Read: ప్రాణం తీసిన tiktok పాపులారిటీ..
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుండగా ఇప్పుడు కొత్త రకమైన వైరస్ మరో ముప్పును తెచ్చిపెడుతోంది. కాగా 179 ఫ్లూ వైరస్‌లతో పాటు జి4 కొత్త రకం వైరస్ గా గుర్తించామని, 2016 నుంచి పందులలో ఈ వైరస్ ఉందని చైనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మనుషుల రోగ నిరోధక శక్తిపై ఈ వైరస్ దాడి చేస్తుందని పేర్కొంది. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుందని, మనషుల నుంచి మనుషులకు సోకుతున్న విషయాన్ని ఇంకా గుర్తించలేదని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. First vaccine: భారత్ లో తొలివ్యాక్సీన్ తీసుకునేది ఎవరు ?

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Also Read: Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్