/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Hindu temple in pak: ఇస్లామిక్ దేశంగా నిత్యం భారతదేశంతో వివాదాన్ని కలిగి ఉండే పాకిస్తాన్‌లో తొలిసారి ఓ హిందూ ఆలయం ( First Hindu temple in pakistan ) నిర్మితమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పది కోట్ల భారీ ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. పాకిస్తాన్‌లో హిందూ ఆలయాన్ని నిర్మిస్తున్నారంటే నమ్మలేకపోతున్నారా... ? కానీ ఇది ముమ్మాటికీ నిజం. అది కూడా దేశ రాజధాని నగరం ఇస్లామాబాద్ నడిబొడ్డున ఉన్న హెచ్ 9 ప్రాంతంలో ఓ భారీ ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది కూడా పూర్తిగా పాకిస్తాన్ ప్రభుత్వ ఖర్చుతోనే కావడం మరో విశేషం. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో పని ప్రారంభమైందని  ఆ దేశ మత వ్యవహారాల శాఖ మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి ( Pak minister Peer Noorul Haque khadri ) స్పష్టం చేశారు. 

ఇస్లామాబాద్‌లోని హెచ్ 9 ప్రాంతంలో దాదాపు 20 వేల చదరపు గజాల సువిశాల స్థలంలో శ్రీ కృష్ణ మందిరం ఆలయానికి ఇవాళ శంకుస్థాపన జరిగింది. పాక్ దేశ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1947కు ముందు ఆ దేశంలో కట్టిన చాలా హిందూ ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని లాల్ చంద్ చెప్పారు. ఇస్లామాబాద్‌లో ఉన్న హిందూ పంచాయత్ ఈ కొత్త ఆలయానికి శ్రీ కృష్ణ మందిర్ ( Srikrishna mandir ) అని పేరు పెట్టింది. ఆలయానికి కావల్సిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ 2017లో హిందూ పంచాయత్ ( Hindu Panchayath) కు అప్పగించింది. ఈ ఆలయానికి సమీపంలోనే హిందూ స్మశానవాటిక నిర్మాణం కూడా జరుగుతుండటం గమనార్హం.

Section: 
English Title: 
First Hindu temple and crematorium in pakistan
News Source: 
Home Title: 

Hindu temple in pakistan: పాక్‌లో హిందూ ఆలయం నిర్మాణం

Hindu temple in pakistan: పాక్‌లో హిందూ ఆలయం నిర్మాణం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Hindu temple in pakistan: పాక్‌లో హిందూ ఆలయం నిర్మాణం
Publish Later: 
No
Publish At: 
Wednesday, June 24, 2020 - 19:01