Food Shortage Crisis: ముదురుతున్న సంక్షోభం- కిలో బియ్యం రూ.500, అరకిలో మిల్క్​పౌడర్ రూ.800!

Food Shortage Crisis: ఇంధన కొరత, ఆకాశాన్నంటిన ఆహారం, నిత్యవసరాల ధరలు, కరెంటు కోతలు.. ఇది ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశంలో కిలో బియ్యం ధర రూ.500లకు దాటింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 12:43 PM IST
  • శ్రీలంకలో తీవ్రమవుతున్న ఆహార సంక్షోభం
  • కొరత కారణంగా ఆకాశాన్నంటుతున్న ధరలు
  • గ్రోసరీ స్టోర్ల ముందు బారులు తీరుతున్న జనం..
Food Shortage Crisis: ముదురుతున్న సంక్షోభం- కిలో బియ్యం రూ.500, అరకిలో మిల్క్​పౌడర్ రూ.800!

Food Shortage Crisis: శ్రీలంకలో మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం తాండవం చేస్తోంది. నిత్యవసరాలు, అత్యవసరాలు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాలు, మిల్క్​ పౌడర్​, మెడిసిన్​, వంట గ్యాస్​, ఇంధనం వంటి వాటికి తీవ్రమైన కొరత ఏర్పడింది.

జనం పెట్రోల్​, డీజిల్ కోసం బంకుల వద్ద కిలో మీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇక ఇంధన కొరత కారణంగా ఇళ్లకు విద్యుత్​ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవస్థలోకి కరెన్సీని భారీగా చొప్పించేందుకు ఆ దేశ రిజర్వు బ్యాంక్ ఈ నెల ఆరంభంలో అనుమతినిచ్చిన కారణంగా.. ధరలు.. నిత్యవసరాల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి.

తీవ్రమైన ద్రవ్యోల్బణం వల్ల ఆహార పదార్థాలు, పానియాల ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ స్టోర్ల వద్ద కూడా జనాలు గంటలతరబడి వెయిట్​ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఆకాశాన్నంటిన ధరలు (శ్రీలంకన్​ రూపీలో)..

కిలో బియ్యం ధర రూ.500లకు చేరింది.
400 గ్రాముల మిల్క్​ పౌడర్ ధర రూ.790కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే దీని ధర రూ.250 పెరిగింది.
కిలో చక్కెర ధరర రూ.290 వద్దకు చేరింది.

ఆహార కొరత, నిరుద్యోగంతో భారత్​కు పెరిగిన వలసలు..

శ్రీలంక ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న కారణంగా.. భారత్​లోని తీర ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అందులోను తమిళనాడుకు వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో 2 వేల మంది వరకు శరణార్థులు రావచ్చని అంచనాలు వస్తున్నాయి.

శ్రీలంక సంక్షోభానికి కారణాలు..

శ్రీలంక అధికంగా టూరిజం, వాణిజ్యంపై ఆధారపడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా వీటిపై తీవ్ర ప్రభావం పడింది. గత రెండేళ్లలో 14 బిలియన్​ డాలర్ల నష్టం వాటిళ్లినట్లు అంచనా. ఇక ఆ దేశ రిజర్వు బ్యాంక్ ప్రకారం 2021 జులై-సెప్టెంబర్ మధ్య శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 1.5 శాతం క్షీణించినట్లు తెలిపింపింది.

Also read: Elon Musk Dance Video: టెస్లా మెగా ఈవెంట్ లో డ్యాన్స్ చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్

Also read: Pakistan: కుర్చీ దిగాలంటూ పాక్ ఆర్మీ చీఫ్‌ హెచ్చరిక... ఇమ్రాన్‌కు పదవీ గండం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News