Hurricane Ida: అమెరికాను వణికించిన హరికేన్.. రివర్ నే రివ‌ర్స్ చేసింది!

Hurricane Ida: హారికేన్ కత్రినా గుర్తుందా.. 16 ఏళ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన తుపాను.  ఇప్పటికీ ఈ పేరు వింటే అమెరికన్ల గుండెల్లో గుబులు రేగుతుంది. కాగా, ఇప్పుడు కత్రినాను మించిన హారికేన్ ఒకటి అమెరికా మీద విరుచుకుపడింది. ఏకంగా ఈ హరికేన్ నది ప్రవాహ దిశనే మార్చేసింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తుపాను విధ్వంసం ఏంటో..

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2021, 01:13 PM IST
  • అమెరికాలో ఇదా హరికేన్ విధ్వంసం
  • దాదాపు 240 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు
  • మిస్సిస్సిపీ నదీ ప్రవహాదిశను మార్చేసిన హరికేన్
Hurricane Ida: అమెరికాను వణికించిన హరికేన్.. రివర్ నే రివ‌ర్స్ చేసింది!

Hurricane Ida: అగ్రరాజ్యం అమెరికాను ఓ హరికేన్ అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాన్​ ధాటికి గాలులు దాదాపు 240 కిలోమీటర్ల వేగం(240kmph)తో వీస్తున్నాయంటే( winds are blowing) నమ్మండి. అంతేకాదు ఏకంగా నదీ ప్రవాహ దిశను మార్చి వెళ్లేలా చేసింది ఈ హరికేన్. ఈ తుపానుకు ఇడా హరికేన్(Ida hurricane )​ అని నామకరణం చేశారు. అవును న్యూఓర్లిన్స్(new Orlin)​లో ఉన్న ఓ నది(river) వ్యతిరేక దిశ(opposite direction)లో ప్రవహిస్తోంది.  ఆ నది పేరు ఏంటంటే మిస్సిస్సిపీ(Mississippi) . ఇంతకీ ఆ నది స్వరూపం ప్రస్తుతం ఎలా ఉంది.. రాబోయే వాతావరణ పరిస్థితుల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఇది అసాధారణమైంది..
అమెరికాను ఇడా హరికేన్​(Ida hurricane) భయపెడుతోంది. ఇడా ధాటికి అక్కడి న్యూ ఓర్లీన్స్ సమీపంలో మిస్సిస్సిప్పి(Mississippi)) నది తిరిగి రివర్స్​ దిశ(reverse direction)లో పయనిస్తుండటమే  పరిస్థితికి అద్దం పడుతోంది. ఇడా హరికేన్​ ప్రభావంతో గాలులు 240 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయని యూఎస్​ జియలాజికల్​ డిపార్టుమెంట్​ ప్రకటించింది. దీంతో  ఏ క్షణంలోనైనా విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాలులు వీచడం, తుపానులు(tupan) రావడం తెలిసిందేనని.. కానీ, ఇలా ఓ నదీ తిరిగి రివర్స్​లో ప్రవహించడం అసాధారమైనదిగా అక్కడి వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Delhi Heavy Rains: దేశ రాజధానిని ముంచెత్తిన భారీ వర్షం, ఒక్కరోజులోనే రికార్డు

 లూసియానా(Luciana)లోని పోర్ట్ ఫోర్‌చాన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 4 హరికేన్ నుంచి 150 mph వేగంతో గాలులు వస్తున్నాయని నేడా హరికేన్ సెంటర్ (NHC) తెలిపింది. సరిగ్గా 16 ఏళ్ల కిందట 'కత్రినా హరికేన్​ '(Hurricane Katrina) విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం అంతటి ఉద్ధృతిలో ఈ ఇడా(Ida) హరికేన్​ వచ్చినట్లు అక్కడి నిపుణులు వెల్లడించారు.

ఆదివారం నాడే తుపానుగా..
ఇడా ఆదివారం ఉదయం 4 వ వర్గం తుఫానుగా మారిందని అక్కడి నిపుణలు తెలిపారు.. అయితే 2020లో లారా తుపాను, 1856లో లాస్ట్​ ఐలాండ్​ హరికేన్​ తుపానులు లూసియానాలో అతి తీవ్రమైన, శక్తి వంతమైన తుపానులుగా వచ్చాయని, అవన్నీ 150 mph వేగంతోనే గాలులు వీస్తూ విధ్వంసం సృష్టించాయని వారు భయాందోళనలు వ్యక్తం చేశారు. 2005లో వచ్చిన కత్రినా హరికేన్​(Hurricane Katrina) 125 mph వేగంతోనే గాలులు వీచాయని గుర్తు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News