అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్రతిష్ఠాత్మక 91వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతల మనసు చూరగొని మన భారతీయ డాక్యుమెంటరీకి ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం కైవసం చేసుకుంది.
కథాంశం ఇదే...
భారత దేశంలోని పలు ప్రాంతాల్లోని ఆడపిల్లలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు దృశ్య రూపమే ‘పీరియడ్’. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. రేఖ జెహతబ్‌చి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింను గునీత్ మోంగాకు చెందిన సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.
ఆస్కార్ కల నెరవేరింది...
ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఉన్న ప్రాధాన్యత మాటల్లో చెప్పలేనిది. ఈ మన భారతీయ సినిమా ఒక్కటైనా అత్యున్నత ఆస్కార్ గెలుచుకుంటే బాగుంటుంది అనేది ప్రతీ సినీ అభిమాని.. సినీ పరిశ్రమకు చెందిన వారందరి కల. ఏదైనా మన సినిమాకి... సినిమాలో నటించిన నటీనటులకు ఆస్కార్ అవార్డు వచ్చిందంటే.. భారతీయులం అంతా చాలా గొప్పగా ఫీలవుతాం. అంతకన్నా గొప్ప అవార్డు ఇంకేమీ లేదు కూడా. అంత ప్రాముఖ్యత ఉంది. ఏటా ఆస్కార్‌కు పలు భారతీయ చిత్రాలు నామినేట్ కావడమే తప్ప అవార్డుకు వచ్చే సరికి నిరాశే ఎదురయ్యేది. కాగా ఇప్పుడు 'పీరియడ్' రూపంలో భారతీయ షార్ట్ ఫిల్మ్ మన ఆస్కార్ కలను నిజం చేసింది.