Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపం, రిచర్ స్కేలుపై 7.1 తీవ్రత

Mexico Earthquake: మెక్సికో వణికిపోయింది. అతి తీవ్రంగా భూకంపం సంభవించింది. జనం భయభ్రాంతులతో పరుగులు తీశారు. మెక్సికో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2021, 11:15 AM IST
  • మెక్సికోలో భారీ భూకంపం, రిచర్ స్కేలుపై 7.1గా తీవ్రత నమోదు
  • భయంతో రోడ్లపై పరుగులు తీసిన ప్రజలు
  • ఆస్థి, ప్రాణనష్టంపై అందాల్సి ఉన్న వివరాలు
Mexico Earthquake: మెక్సికోలో భారీ భూకంపం, రిచర్ స్కేలుపై 7.1 తీవ్రత

Mexico Earthquake: మెక్సికో వణికిపోయింది. అతి తీవ్రంగా భూకంపం సంభవించింది. జనం భయభ్రాంతులతో పరుగులు తీశారు. మెక్సికో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పసిఫిక్ తీరానికి సమీపంలో భారీ భూకంపం(Earthquake)సంభవించింది. మెక్సికోలో భూకంపం కారణంగా భారీగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పసిఫిక్ తీరానికి సమీపంలో 7.1 తీవ్రత రిచర్ స్కేలుపై నమోదైనట్టు నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్ట్‌కు ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం కేంద్రీకృతమైంది. 

రాజధాని నగరంలో భాకంపంతో ప్రజలు తీవ్ర భయాందోనళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటికొచ్చి రోడ్లపై పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో పర్యాటకులు హోటళ్లను ఖాళీ చేశారు. భూ ప్రకంపనల తీవ్రతకు వందలాది కిలోమీటర్ల మేర భవనాలు కొన్ని సెకన్ల పాటు కదిలిపోయాయి. ముందుగా నైరుతి మెక్సికోలో భూకంపం(Mexico Earthquake) తీవ్రత 6.9గా నమోదైంది. ఆస్థి, ప్రాణనష్టంపై ఇప్పటి వరకూ ఏ విధమైన నివేదికలు వెల్లడి కాలేదు. ఓ వ్యక్తి మరణించినట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. భూకంపం కారణంగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. చాలా ప్రాంతాల్లో గ్యాస్ లీకేజీ వార్తలు వ్యాపిస్తున్నాయి. మెక్సికో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయింది. దాంతో గత అనుభవం ఒక్కసారిగా కళ్లముందుకు వచ్చింది. 1985 సెప్టెంబర్ 19వ తేదీన మెక్సికో నగరంలో 8.1 తీవ్రతో(Richter scale) భారీ భూకంపం చోటుచేసుకుంది. అప్పుడు పదివేలమంది వరకూ ప్రాణాలు కోల్పోగా..వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత 2017లో వచ్చిన భూకంపంలో 370 మంది మరణించారు. అత్యధికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాల సరిహద్దులో ఉన్న మెక్సికో ఒకటిగా ఉంది. 

Also read: Afghanistan New Government: ఆఫ్ఘన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు, వివిధ శాఖల కీలక మంత్రులు వీరే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook

Trending News