నన్ను క్షమించండి : జుకర్‌బర్గ్

Last Updated : Oct 2, 2017, 01:07 PM IST
నన్ను క్షమించండి : జుకర్‌బర్గ్

ఫేస్‌బుక్ అందిస్తున్న సేవల వలన ప్రజల మధ్య పలు విభ‌జ‌న‌లు తలెత్తినందుకు ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ బహిరంగ క్షమాపణలను కోరారు. యూదు పర్వదినమైన యోమ్ కిప్పోర్ ముగిసిన సంద‌ర్భంగా ఆయన ఒక ప్రకటన చేశారు. `మానవాళిని ఏకం చేయ‌డానికి ప్రయత్నించాల్సిన నా ఉద్యోగం వారిని విభ‌జించేందుకు దోహదపడింది. అందుకోసం క్షమాపణలు అడుగుతున్నా. జరిగిన పరిణామాలపై మేము ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. వాటి ద్వారా మంచినే పెంచేందుకు మా సంస్థ ఇక నుండి ప్రయత్నిస్తుంది. మా నుండి ఏదైనా తప్పు జరిగినట్లయితే  మీరు క్షమించగలరని కోరుతున్నాం` అని తెలియజేశారు.  అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు జరిగినప్పుడు.. ఫేస్‌బుక్ ద్వారా వెలువడిన పలు ప్రకటనలు ర‌ష్యా రాజకీయాలను ప్రభావితం చేసినట్లు ఆరోప‌ణ‌లు వచ్చిన నేపథ్యంలో ఆయ‌న ఈ పోస్టు చేసి ఉండవచ్చిని పలువురు అభిప్రాయపడుతున్నారు.

&

;

తనపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తూ జుకర్‌బర్గ్ మాట్లాడారు. "ఫేస్‌బుక్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ట్రంప్ అంటున్నారు. కానీ లిబరల్స్ వాదన మరోలా ఉంది. మేము ట్రంప్‌కు సహాయం చేశామని వారు అనుకుంటున్నారు. తమకు నచ్చని కంటెంట్ ఫేస్బుక్‌లో కనిపించినప్పుడు ఇరువర్గాలు కూడా మా గురించి తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాయి. ఇలాంటి ఒక వేదికను నడుపుతున్నప్పుడు ఆలోచనలకు తగ్గ సమాచారాన్ని సమీక్షించుట కత్తి మీద సాము లాంటి పనే"  అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ 100,000 డాలర్ల విలువగల రష్యన్ రాజకీయ ప్రకటనలను బహిరంగపరిచినందుకు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు, వారు అడిగిన దాదాపు 3,000 రష్యన్ ప్రకటనల సమాచారాన్ని వారికి అందించేందుకు అంగీకరించింది. 

Trending News