భార్య అంత్యక్రియల కోసం నవాజ్‌కు పెరోల్‌

భార్య అంత్యక్రియల కోసం నవాజ్‌కు పెరోల్‌

Last Updated : Sep 12, 2018, 11:32 AM IST
భార్య అంత్యక్రియల కోసం నవాజ్‌కు పెరోల్‌

అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌కు.. భార్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్‌ లభించింది. క్యాన్సర్‌తో దీర్ఘకాలంగా పోరాటం చేసిన నవాజ్‌ సతీమణి కుల్సూమ్‌ నవాజ్‌ (68).. మంగళవారం లండన్‌లో కన్నుమూశారు.

రావల్పిండిలో శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌తో పాటు ఆయన కుమార్తె మరియం, అల్లుడు మహ్మద్‌ సఫ్దర్‌లకు కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరైందని అధికార వర్గాలు తెలిపాయి. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చి, లాహోర్‌లోని షరీఫ్‌ కుటుంబానికి చెందిన నివాసంలో ఖననం చేస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య బేగం కుల్సూమ్‌ నవాజ్‌ మృతదేహం శుక్రవారం పాకిస్థాన్‌‌కు చేరుకుంటుందని పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో  బాధపడుతున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ భార్య కుల్‌సుమ్‌ షరీఫ్‌ 2017 నుంచి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం లండన్‌లో మృతి చెందినట్లు పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ ప్రెసిడెంట్‌ షహాబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. కాగా ఆమె మృతికి పలువురు పాకిస్థాన్‌  నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Trending News