AP SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!

AP SSC Results 2022 Date and Time. ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు (జూన్ 6) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 12:52 PM IST
  • నేడే పదో తరగతి ఫలితాలు విడుదల
  • రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి
  • రాష్ట్ర వ్యాప్తంగా 6,21,799 మంది
AP SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!

AP SSC Results 2022, AP SSC Results releasing today at 12 PM: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాలను నేడు (జూన్ 6) విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ డైరెక్టర్‌ దేవానంద్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని ఎమ్‌జీ రోడ్‌‌లో ఉన్న గేట్‌వే హోటల్‌ వేదికగా ఫలితాల విడుదల కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.results.bse.ap.gov.inలో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ముందుగా ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్‌ 4న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఫలితాలను విడుదల చేయడం వీలు కాలేదు. ఆలస్యమైనా సరే 4నే సాంకేతిక సమస్యలను పరిష్కరించి విడుదల చేయాలని విద్యాశాఖ చూసినా అది సాధ్యం కాలేదు. దాంతో సోమవారానికి ఫలితాల విడుదల వాయిదా పడింది. నేడు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు.

పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,21,799 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక మహమ్మారి కారణంగా గత రెండేళ్లగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీతో సహా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలన్నింటినీ యథాతథంగా నిర్వహించారు. 

Also Read: Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!  

Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News