Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!

Heavy rains for the next three days in Telangana due to Southwest monsoons. అధిక ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 07:54 AM IST
  • తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు
  • రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు
  • నాలుగు రోజుల ముందు పశ్చిమ బెంగాల్‌కు
Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు!

Southwest monsoons will enters AP and Telangana in two days: నిత్యం 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. 

నైరుతి రుతుపవనాల కారణంగా ఆదివారం (జూన్ 5) మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా చిరు జల్లులు కురిసాయి. మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, మాగనూరు, నల్గొండ, హైదరాబాద్ వరంగల్‌ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో భానుడు భగభగ మంటున్నాడు. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాత రెండు నుంచి 4-5 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉంది. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, విదర్భ, మధ్యప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతంలో రాగల రెండు రోజుల పాటు వేడిగాలులు కొనసాగనున్నాయి. 

అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్‌, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని చాలా ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణ ప్రారంభ తేదీకి కనీసం నాలుగు రోజుల ముందు పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నాయి. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. 

Also Read: Horoscope Today June 6 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ప్రాణహాని ఉంది!

Also Read: Gold Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News