బ్రేకింగ్ న్యూస్: పీఎన్‌బీ స్కాంలో నిందితుడు నీరవ్ మోడీ లండన్‌లో అరెస్ట్ !!

                            

Updated: Mar 20, 2019, 03:38 PM IST
బ్రేకింగ్ న్యూస్: పీఎన్‌బీ స్కాంలో నిందితుడు నీరవ్ మోడీ లండన్‌లో అరెస్ట్ !!

పరారీలో ఉన్న ప్రముఖ వజ్రాల వ్యాపారీ నీరవ్‌ మోడీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ విజ్ఞప్తి మేరకు  గత రెండు రోజుల క్రితమే అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చాలని లండన్ న్యాయస్థానం పోలీసులకు అదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు  కోర్టులో హాజరుపర్చారు. 

నీరవ్ మోడీ  పంజాబ్ నేషనల్ బ్యాంకులో పెద్ద మొత్తంలో బకాయిలను ఎగొట్టి  విదేశాలకు పారిపోయాడు. అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి సుమారు రూ.14 వేల కోట్ల రుణాలు ఎగనామం పెట్టినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నీరవ్ మోడీ పరారీలో ఉండటంతో  బ్యాంకర్లు న్యాయస్థాన్ని ఆశ్రయించడం..ఈ కేసు విచారణ బాధ్యత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తీసుకోవడం జరిగింది.

నీరవ్ మోడీ లండన్ లో తలదాచుకుంటున్న  విషయం మీడియా కంటికి చిక్కడంతో అతన్ని భారత్ కు రప్పించేందుకు కేంద్రం ప్రభుత్వం ఇంగ్లండ్ దేశాన్ని సంప్రదించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపపథ్యంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్టకేలకు నీరవ్ మోడీ విషషంలో భారత  విదేశాంగశాఖ చేసిన ఒత్తిడి ఫలించినట్లయింది
 

Tags: