Lung Cancer Vaccine: కేన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. కొన్ని తీవ్రమైనవి కాగా కొన్ని సాధారణమైనవి. ఏదైనా సరే ఏదో ఒక సమయంలో మృత్యువు వరకూ తప్పకుండా తీసుకెళ్తుంది. కేన్సర్‌కు పూర్తి చికిత్స లేకపోవడమే ఇందుకు కారణం. అలాంటిది ఊపిరితిత్తుల కేన్సర్‌కు ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సిన్ కనుగొన్నారు.
వివిధ రకాల కేన్సర్‌లలో ఒకటి లంగ్ కేన్సర్. అత్యధిక మరణాలు సంభవించే కేన్సర్ రకాల్లో ఇదొకటి. బ్రిటన్‌కు చెందిన పరిశోధకుల బృందం ఊపిరితిత్తుల కేన్సర్ విషయంలో గ్రేట్ రిలీఫ్ ఇచ్చే న్యూస్ అందిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, లండన్ యూనివర్శిటీకు చటెందిన ఫ్రాన్సిస్ క్రిక్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఇది ఊపిరితిత్తుల కేన్సర్ కణాలు, ఉత్పరివర్తనాలుగా రూపాంతరం చెందే ప్రమాదకర ప్రోటీన్‌ను గుర్తించి ఇమ్యూనిటీ వ్యవస్థకు శిక్షణనిచ్చే డీఎన్ఎను ఉపయోగించుకుంటుంది. LungVaxగా పిలిచే ఈ వ్యాక్సిన్ గతంలో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్‌ను పోలి ఉంటుంది.
ప్రారంభదశలో పరిశోధకులు 3 వేల వ్యాక్సిన్లు తయారు చేయనున్నారు. నియో యాంటీజెన్స్ అనే ప్రమాదకర ప్రోటీన్లను గుర్తించి ఈ వ్యాక్సిన్ నాశనం చేస్తుంది. ఊపిరితిత్తుల్లో కణాలు అదుపు తప్పి విచ్చలవిడిగా పెరిగితే మెటాస్టాసిస్ ప్రక్రియతో కేన్సర్ లంగ్స్ చుట్టుూ ఉన్న అవయవాలకు సైతం వ్యాపిస్తుంది. అందుకే బ్రిటన్‌లో ప్రతియేటా 50వేలకు పైగా లంగ్ కేన్సర్ కేసులు వస్తుంటే అందులో 35 వేల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి 10 కేసుల్లో 7 కేసులు ధూమపానం వల్ల వచ్చేవే కావడం గమనార్హం. ప్రస్తుతం LungVax క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని తెలుస్తోంది. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
Also read: Moscow Gun Firing: మాస్కోలో దారుణం, దుండగుల కాల్పుల్లో 40 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook