పాక్ రహస్య కోడ్ కుట్రను బయటపెట్టిన భారత్ !!

కశ్మీర్ విషయంలో భారత్ ను నేరుగా ఎదుర్కొన లేక దొడ్డిదారిన ఏదో సాధించాలని పాక్ తాయత్రయపడుతోంది.

Last Updated : Sep 12, 2019, 04:18 PM IST
పాక్ రహస్య కోడ్ కుట్రను బయటపెట్టిన భారత్ !!

కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నిర్ణయంతో రగిలిపోతున్న పాక్...భారత్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక దొంగ దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తోంది. కశ్మీర్ లో రక్తపాతం సృష్టించాలంటూ ఉగ్రవాదులకు పాక్ రహస్య కోడ్ సందేశాలు పంపుతోంది. ఇందుకోసం పలు ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిషన్‌ వాడుతున్నారు. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్సీ వర్గాలు గుర్తించాయి.

ఇంటెలిజెన్సీ వర్గాలు సమాచారం ప్రకారం పాక్ జాతీయ గీతమైన ‘క్వామీ తరానా’ ద్వారా ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ సాయంతో ఉగ్రవాద సంస్థల నేతలు తమ అనుచరులులతో పాటు పాక్ సానుభూతిపరులకు రహస్య సందేశాలను కోడ్  ద్వారా పంపుతున్నారని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. 

సీక్రెట్ కోడ్ ఆఫరేషన్ లో భాగంగా  ఎఫ్ఎం స్టేషన్లతో పాటు హై ఫ్రీక్వెన్సీ రేడియో కేంద్రాలను పాక్ సరిహద్దుకు తరలిస్తోందని భారత నిఘా సంస్థలు తెలిపాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు నియంత్రణ రేఖ వెంట ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో కేంద్రాలను ఏర్పాటు చేసిన పాక్... దీని ద్వారా ఇలాంటి కుట్రపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్ల ఇంటెలిజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇదిలా ఉంటే ఈ రహస్య సందేశాలను తాము డీకోడ్ చేశామని భారత ఇంటెలిజెన్సీ వర్గాలు వెల్లడించాయి. అందులో ‘కశ్మీర్ లో అలజడి సృష్టించండి.... అందుకోసం అవసరమైతే పుకార్లు వ్యాప్తి చేయండి’ అని పాక్ నుంచి ఉగ్రమూకలకు సందేశాలు అందున్నట్లు ఇంటెలిజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. 
 

Trending News