ప్చ్.. రిహార్సల్స్‌లో కుప్పకూలిన పాక్ ఫైటర్ జెట్

పాకిస్తాన్ డే షో కోసం నిర్వహిస్తున్న రిహార్సల్స్‌లో అమెరికా రూపొందించిన ఎఫ్ 16 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ విషయాన్ని పాక్ అధికారులు వెల్లడించారు.

Updated: Mar 11, 2020, 02:21 PM IST
ప్చ్.. రిహార్సల్స్‌లో కుప్పకూలిన పాక్ ఫైటర్ జెట్
Representational Image

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానం కూలిపోయింది. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో ఎయిర్ ఫోర్స్ F-16 యుద్ధ విమానం మార్చి 11న (బుధవారం) క్రాష్ అయిందని ఓ అధికారి వెల్లడించారు. ఘటనా స్థలానికి సహాయక  బృందాలు చేరుకున్నాయని  పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. రాయిటర్స్‌ ప్రతినిధి పాక్ ఎయిర్ ఫోర్స్ అధికారులు ఫోన్‌లో మాట్లాడారు.

అమెరికా రూపొందించిన F-16 యుద్ధ విమానం పాకిస్థాన్ డే ఎయిర్ షో సన్నాహకాలలో భాగంగా చేస్తున్న విన్యాసాలలో కూలిపోయింది. మార్చి 23న పాకిస్థాన్ డే ఎయిర్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఫైటర్ జెట్ రిహార్సల్స్ చేస్తుండగా కూలిపోయిందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Avengers బ్యూటీ స్కార్లెట్ జాన్సన్ అందాలివిగో!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..