GPS Jamming: స్తంభించిన జీపీఎస్‌.. విమానాలకు అంతరాయంతో ప్రపంచ దేశాల్లో కలకలం

Planes Hit By GPS Jamming Across Europe: ఆకాశంలో జీపీఎస్‌ వ్యవస్థ స్తంభించింది.. దారి చూపే జీపీఎస్‌ వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.  దీంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర కలకలం రేగింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 26, 2024, 10:09 PM IST
GPS Jamming: స్తంభించిన జీపీఎస్‌.. విమానాలకు అంతరాయంతో ప్రపంచ దేశాల్లో కలకలం

GPS Jamming: జీపీఎస్‌ వ్యవస్థ అంటే మార్గం చూపేది అని అందరికీ తెలిసిందే. ఆకాశ మార్గంలో విమానాలకు కూడా జీపీఎస్‌ వ్యవస్థ మార్గం చూపిస్తుంది. అలాంటి వ్యవస్థకు కొద్దిరోజులుగా అంతరాయం ఏర్పడుతోంది. దీని ప్రభావంతో విమానాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తాజాగా యూరప్‌లో జీపీఎస్‌ జామింగ్ సమస్య తీవ్రంగా ఏర్పడింది. దీని ఫలితంగా దాదాపు 1,600లకు పైగా విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ విషయాన్ని జీపీఎస్‌ ట్రాకింగ్‌ సంస్థలు వెల్లడించాయి. అయితే జీపీఎస్‌ వ్యవస్థకు ఆటంకం ఏర్పడడంపై అంతర్జాతీయంగా తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి రష్యా దేశం కారణంగా యూరప్‌ దేశాలు భావిస్తున్నాయి.

Also Read: Putin Win: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ సంచలన విజయం... 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం

బాల్దిక్‌ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ సమస్య వేధిస్తోందని జీపీఎస్‌ ట్రాక్‌ చేసే ఓపెన్ సోర్స్‌ ఇంటలిజెంట్‌ గ్రూప్‌ తెలిపింది. ఇటీవల తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా రెండు రోజుల్లో 1,614 విమానాలు దీని ప్రభావానికి లోనయినట్లు తేలింది. యూరప్‌లోని ఫిన్‌లాండ్‌, పోలాండ్‌, దక్షిణ స్వీడన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలకు ఇలాంటి సమస్య ఎదురవుతోందని ఆయా దేశాలు గుర్తించాయి. అయితే గతంలో ఇలాంటి సమస్య ఎదురైనా ఇంత తీవ్రంగా ఎప్పుడు కాలేదని విమానయాన సంస్థలు వెల్లడిస్తున్నాయి. జీపీఎస్‌ వ్యవస్థను నిలిపివేసే శక్తి రష్యా దేశానికి ఉండడంతో ఆ దేశంపై యూరప్‌ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Simon Harris: చరిత్ర సృష్టించిన ఎన్నారై.. ఐర్లాండ్‌ అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు

ఇటీవల అంతర్జాతీయంగా రష్యాపై యూరప్‌ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణం చేతనే యూరప్‌ దేశాలపై కక్ష తీర్చుకునేందుకు రష్యా జీపీఎస్‌ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే ఆరోపణలు అంతర్జాతీయంగా వస్తున్నాయి. నావిగేషన్‌ వ్యవస్థను తప్పుదోవ పట్టించడం వెనుక చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిగ్నల్‌ వ్యవస్థ ఆటంకం ఏర్పడుతున్న దేశాలు దీనిపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నాయి. ఈ సమస్యకు గల కారణాలపై విచారణ చేపట్టాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News