శ్రీలంకలో పార్లమెంట్‌ను సస్పెండ్ చేసిన అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం నాడు పార్లమెంటును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

Last Updated : Oct 27, 2018, 03:34 PM IST
శ్రీలంకలో పార్లమెంట్‌ను సస్పెండ్ చేసిన అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం నాడు పార్లమెంటును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 16వ తేది వరకు ఈ సస్పెన్షన్ ఉంటుందన్నారు. ప్రస్తుతం శ్రీలంక రాజకీయాల్లో అనిశ్చితి నెలకొంటున్న  సందర్భంలో తన మెజారిటీని నిరూపించుకొనేందుకు ఎమర్జెన్సీ సెషన్ కోరాలని రణీల్ విక్రమసింఘే నిర్ణయించుకున్న తర్వాతే.. ఈ సస్పెన్షన్ రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. రణీల్‌ విక్రమ్‌సింగ్‌ను ప్రధాని పదవి నుండి తొలగించి, మాజీ శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సను కొత్త ప్రధానిగా అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడి రాజకీయం సంక్షోభంలో పడింది.

ఈ క్రమంలో సిరిసేన గెజిట్ నోటీసులు జారీ చేశారు. అందులో రణీల్ విక్రమ సింఘేని పదవి నుండి తొలిగించి.. రాజపక్సని కొత్త ప్రధానిగా నియమించినట్లు పేర్కొనడం జరిగింది. ఈ గెజిట్ ప్రకటనపై  విక్రమ్ సింఘే అభ్యంతరం తెలిపారు. రాజపక్స ప్రమాణం చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. తాను పార్లమెంటులో మెజారిటీ నిరూపించుకోవాలని భావిస్తున్నానని విక్రమ్ సింఘే తెలిపారు. 

విక్రమసింఘేకు గతకొంత కాలంగా సిరిసేన నాయకత్వం వహిస్తున్న పార్టీ..  యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ (యు.పి.ఎఫ్.ఏ) మద్దతు ఇస్తోంది. కానీ శుక్రవారం అదే పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో.. సింఘే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఆ తర్వాత వెంటనే దేశ అధ్యక్షుడైన సిరిసేన.. రాజపక్సని దేశ ప్రధానిగా నియమించడంతో ప్రజానీకం ఆశ్చర్యపోయింది.

Trending News