Racist Attack on Indian Man in US California: ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో ఇండో-అమెరికన్ మహిళలపై జాత్యహంకార దాడి మరవకముందే.. మరో ఇండో-అమెరికన్ వ్యక్తిపై జాత్యహంకార దాడి జరిగింది. అయితే ఈసారి జాత్యహంకార దాడి చేసింది భారత సంతతికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. కృష్ణన్ జయరామన్ అనే ఇండో-అమెరికన్ వ్యక్తిపై 37 ఏళ్ల తేజిందర్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి ఈ జాత్యహంకార దాడికి పాల్పడ్డాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అమెరికన్ మీడియా కథనాల ప్రకారం.. కృష్ణన్ జయరామన్ ఆగస్టు 21న కాలిఫోర్నియాలోని ఫ్రిమోంట్‌లో ఉన్న రెస్టారెంట్‌కి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి కృష్ణన్ జయరామన్‌ని దూషిస్తూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. 'డర్టీ హిందూ.. నువ్వు అసహ్యంగా కనిపిస్తున్నావు.. ఇంకోసారి ఇలా పబ్లిక్‌లోకి రాకు.. ఇది ఇండియా కాదు.. అమెరికా.. మీ హిందువులే ఇంత.. అసహ్యకరం..' అంటూ నోటికొచ్చినట్లు తిట్టాడు. చెప్పరాని భాషలో బూతులు మాట్లాడాడు. అంతేకాదు, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అసభ్యకర వ్యాఖ్యలతో దూషించాడు.
కృష్ణన్ జయరామన్ ఇదంతా తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. కృష్ణన్ జయరామన్‌తో పాటు రెస్టారెంట్ ఉద్యోగి దీనిపై పోలీసులకు సమాచారమివ్వడంతో వెంటనే అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు. జాత్యహంకార దాడికి పాల్పడిన ఆ వ్యక్తిని భారత సంతతికి చెందిన తేజిందర్ సింగ్‌గా గుర్తించారు. అతను భారత సంతతి వ్యక్తి అని తెలిసి తాను మరింత బాధపడ్డానని జయరామన్ తెలిపాడు. తేజిందర్ తనను దూషిస్తూ తనపై ఉమ్మాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నాడు.
జాత్యహంకార దాడులను తాము ఉపేక్షించేది లేదని.. కుల, మత, లింగ, జాతీయతతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి రక్షణ కల్పించేందుకే తాము ఉన్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ ఇతర కమ్యూనిటీల పట్ల గౌరవ భావంతో ఉండాలని.. ఎవరికైనా ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే తమకు సమాచారమివ్వాలని సూచించారు.
కొద్దిరోజుల క్రితం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ మెక్సికన్-అమెరికన్ మహిళ భారత సంతతికి చెందిన మహిళలపై ఇలాగే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసింది. ఇండియన్స్ పట్ల ద్వేషాన్ని వెళ్లగక్కింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
A video of an Indian-American being verbally abused in an unprovoked hate attack has appeared online.
Krishna Iyer, a resident of Fresno, California, faced the abuse at a Taco Bell on 21 August.
The abuser calls him a "dirty-a## Hindu" and even abuses ex-PM Indira Gandhi. pic.twitter.com/cJvr8N4nvL
— Dhairya Maheshwari (@dhairyam14) August 28, 2022
Also Read: చివరి ఓవర్‌లో సూర్యకుమార్ వీరవిహారం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ రియాక్షన్!
Also Read: చిటికెలు వేస్తే ఫలితం ఇలానే ఉంటుంది.. లైగర్‌పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook