Russia New Invention: నిన్న తొలి కరోనా వ్యాక్సిన్..ఇప్పుడు గాలిలోనే వైరస్ గుర్తించే సరికొత్త పరికరం

కరోనా వైరస్ కట్టడిలో రష్యా మిగిలినదేశాల కంటే ఓ అడుగు ముందే ఉంటోంది. ఇప్పటికే తొలి కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రకటించి సంచలనం రేపింది. ఇప్పుడు సరికొత్తగా...గాలిలోనే కరోనా వైరస్ ను కనుగొనే పరికరాన్ని అభివృద్ధి చేసింది. 

Last Updated : Sep 1, 2020, 11:07 PM IST
Russia New Invention: నిన్న తొలి కరోనా వ్యాక్సిన్..ఇప్పుడు గాలిలోనే వైరస్ గుర్తించే సరికొత్త పరికరం

కరోనా వైరస్ ( Corona virus ) కట్టడిలో రష్యా మిగిలినదేశాల కంటే ఓ అడుగు ముందే ఉంటోంది. ఇప్పటికే తొలి కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రకటించి సంచలనం రేపింది. ఇప్పుడు సరికొత్తగా...గాలిలోనే కరోనా వైరస్ ను కనుగొనే పరికరాన్ని అభివృద్ధి చేసింది.  

కరోనా వైరస్ కట్టడి కోసం అన్ని అగ్రదేశాలు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్ కు మందు కనుగొనడానికి, వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా మిగిలిన దేశాలకంటే ముందు వరుసలో నిలబడుతోంది. దీనికి కారణం ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వి  ( World's first corona vaccine sputnik v ) ను ఇప్పటికే రిజిస్టర్ చేసి సంచలనం రేపింది. ఇప్పుడు మరో ఘనత సాధించింది. గాలిలోనే కరోనా వైరస్ ను గుర్తించగలిగే సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ యంత్రం కరోనా వైరస్ తో పాటు ఇతర వైరస్, బ్యాక్టీరియా, విషపదార్ధాల్ని కూడా గుర్తించగలుగుతుంది. తక్కువ సంఖ్యలో ఉన్న సూక్ష్మ జీవులను గుర్తించి రెప్పపాటు కాలంలో మనల్ని అప్రమత్తం చేస్తుందని తెలుస్తోంది. 

తొలి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన గమేలియా ఇనిస్టిట్యూట్ ( Gamelia institute ) సహకారంతో రష్యా ( Russia ) కు చెందిన కేఎమ్ జే ఫ్యాక్టరీ ఈ పరికరాన్ని తయారుచేసింది. డిటెక్టర్ బయోగా ఈ పరికరాన్ని పిలుస్తున్నారు. మాస్కో వద్ద జరిగిన ఆర్మీ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్  ఆర్మీ2020లో ఈ పరికరాన్నిప్రదర్శించారు. అయితే ఈ పరికరం సైజు కాస్త పెద్దదే. ఓ రిఫ్రిజిరేటర్ మాదిరి ఉంటుంది. ఈ పరికరం అంతర్భాగంలో చిన్న ల్యాబొరేటరీల ప్యాక్ ఉంటుంది. ఇవి వివిధ పరీక్షల్ని నిర్వహిస్తూ..పరిసర ప్రాంతాల్లోని గాలిని గ్రహించి రెండుస్థాయిల్లో పరీక్షిస్తాయి. కరోనా వంటి హానికారక వైరస్ కనుగొంటే వెంటనే అప్రమత్తం చేసేస్తుంది. 

తొలి దశలో సమీపంలోని గాలి నమూనాల్ని సేకరిస్తుంది. 10-15 సెకన్ల వ్యవధిలో వైరస్, బ్యాక్టీరియా, టాక్సిన్ ఉంటే అప్రమత్తం చేస్తుంది. గాలిలో పదార్ధాల్ని రెండు లేదా ఇంకా ఎక్కువసార్లు విశ్లేషించి మరీ చెబుతుంది. గాలిని విశ్లేషించి చెప్పే ప్రపంచంలోనే తొలి పరికరమిది. ఈ పరికరాన్ని ముఖ్యంగా మెట్రో, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ...ఓపెన్ ప్రదేశాల్లో అమర్చాలని ఆలోచిస్తున్నారు. Also read: Oxford-Astrazeneca vaccine: చివరి దశలో ప్రయోగాలు..నవంబర్ నాటికి సిద్ధం

Trending News