ఏదైనా విషయంపై పూర్తి అవగాహన ఉంటే కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. రుచి చెప్పగలగడంలో ఎక్స్ పర్ట్ అయితే చాలు..నెలకు లక్షల్లో జీతం ఇచ్చే ఉద్యోగం నిరీక్షిస్తుంది. ఎక్కడో ఏంటో తెలుసుకోవాలని ఉందా..అయితే ఇది చదవండి మరి.
మనకు తెలియని ఉద్యోగాలు చాలానే ఉన్నాయి మనచుట్టూ. అన్ని విషయాల్లో కాకపోయినా ఏదైనా ప్రత్యేక అంశంలై నిపుణులైతే చాలా లక్షల్లో జీతాలిచ్చే ఉద్యోగాలు లభిస్తాయి. సరిగ్గా ఇది అలాంటిదే మరి. యూకే ( UK ) కు చెందిన స్కాటిష్ బిస్కెట్ కంపెనీ ( Scotish Biscuit company ) బోర్డర్ బిస్కెట్స్ ( Border Biscuits ) ఓ కొత్త ఉద్యోగాన్ని ( Master Biscuitier ) సృష్టించింది. అదేంటో తెలుసా. బిస్కెట్ రుచి చూసి చెప్పడం. అదేంటి అంత సులభం అనుకుంటున్నారా. కొంతమందికి సులభమే. జీతం ఎంతో తెలుసా నెలకు 3 లక్షల రూపాయలు. ఏంటి దిమ్మ తిరుగుతుందా. నిజమే..వివరాలివీ.
స్కాటిష్ బిస్కెట్ కంపెనీ బోర్డర్ బిస్కెట్స్ ఆఫర్ చాలా టెంప్టింగ్ గానే ఉంది. నెలకు 3 లక్షలకు పైగా జీతం. ఏటా 35 సెలవులు. ఇంకా బోనస్, ఇంక్రిమెంట్లు అదనం. కచ్చితంగా టెంప్టింగ్ ఆఫరే కాబట్టి అప్లికేషన్లు కుప్పల్లో వచ్చి పడుతున్నాయిట. అయితే ఈ ఉద్యోగం కోసం మీకు కొన్ని ప్రత్యేకతలు, ప్రతిభ ఉండాలి. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా పరీక్ష నిర్వహిస్తారు. దీనికోసం బిస్కెట్లపై మంచి పరిజ్ఞానం ఉండాలి. అంతేకాదు.. లీడర్ షిప్ క్వాలిటీస్ ( Leader ship qualities ) పుష్కలంగా ఉండాలి. సమాచార మార్పిడిలో మంచి అవగాహన ఉండాలి. ఇక కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవడం, అవసరమైన సూచనలు ఇచ్చే వారికి ప్రాధాన్యత ఉంటుంది. బేకరీ ఉత్పత్తులు, ప్రక్రియలతో శాస్త్రీయ, ఆచరణాత్మక అనుభవం తప్పనిసరి. మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ తెలిసుండాలి. దాంతో పాటు యూకే చట్టాలు, సాంకేతికత, పరిశ్రమల గురించి తగిన అవగాహన ఉంటే మంచిదని కంపెనీ తెలిపింది.
ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు 3 లక్షల జీతం ( monthly 3 lakh salary ) తో పాటు 35 సెలవులుంటాయి. బోనస్, వేయికి పైగా రిటైల్ స్టోర్లలో డిస్కౌంట్, ఉచిత ఆన్‌లైన్ వ్యాయామ కార్యక్రమాలు, ఉచిత బిస్కెట్లు అదనపు ప్రయోజనాలు చాలానే లభిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేసేయండి. మీ అదృష్టాన్ని, ప్రతిభను పరీక్షించుకోండి. మరిన్ని వివరాలకు https://borderbiscuits.peoplehr.net/ క్లిక్ చేయండి. Also read: Aastronaut Casts Vote From Space: అంతరిక్షం నుంచి ఓటు వేసిన వ్యోమగామి