ఢిల్లీ: దక్షిణాసియా అభివృద్ధి మరియు భవిష్యత్తు అవకాశాలే ప్రధాన అంశంగా వియాన్ ఛానల్ దుబాయ్ వేదికగా Unleashing the Power of South Asia పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తోంది. జీ న్యూస్ అంతర్జాతీయ ఛాలన్ WION ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణాసియా అంతర్జాతీయ సదస్సులో యూఏఈ కు చెందిన కేబినెట్ మంత్రి షేక్ నహయాన్ ముబారక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన భారత్ అనుసరిస్తున్న విధానాలను మెచ్చుకున్నారు
ఆర్ధికరంగంలో భారత్ అభివృద్ధి భేష్
ఈ సందర్భంగా నహయాన్ మాట్లాడుతూ ఆర్ధిక రంగంలో దక్షిణాసియా దేశాల్లో భారత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారత్ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాల వల్లే ఇరుదేశాల మధ్య భారీ ఎత్తులో వాణిజ్యం జరుగుతుందన్నారు. భారత్ అనుసరిస్తున్న విధానాలతో అక్కడ నూతన అవకాశాలు సృష్టిస్తోందన్నారు. భారత్ లో మానవ వనరులకు కొరత లేదని.. భారత్ నుంచి వచ్చిన లక్షల మంది యూఏఈకి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారని కొనియాడారు
భారత్ తో దోస్తీ రాజకీయంగానూ కీలకమే..
ప్రపంచ వ్యవహారాల్లో చరుగ్గా భారత్ చురగ్గా పాల్గొంటుందని కొనియాడారు. రాజకీయంగా కూడా భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఎంచుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు