జపాన్ (Japan ) ప్రధాన మంత్రి షింజో అబే తన పదవికి రాజీనామా చేశారు. ఆనారోగ్య కారణాల వల్ల తను ఇక ప్రధాన మంత్రిగా కొనసాగలేను అని తన పోస్ట్ నుంచి రిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. గత కొన్ని మాసాల నుంచి ఇంటెస్టినల్ డిజార్డర్ ( Intestinal Disorder ) వల్ల ఇబ్బంది పడుతున్న ప్రధామంత్రి చికిత్స అందుకుంటున్నారు. కానీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి పదవి నుంచి హఠాత్తుగా రాజీనామా చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు కోరారు. తన బాధ్యత నుంచి తప్పుకున్నందుకు క్షమించమని కోరిన షింజో అబే ( Shinzo Abe ) తన పరిస్థితి రోజు రోజుకూ దిగాజారుతోంది అని, ప్రజలు తననుంచి ఆశించిన పనులు చేయలేకపోతున్నా అని వెల్లడించారు. ఏడున్నర సంవత్సరాల నుంచి జపాన్ ప్రధానిగా ఉన్న ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఇంటెస్టినల్ డిజార్డర్ తో బాధ పడుతున్నారు. ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ కరోనావైరస్ ( Coronavirus ) వల్ల జరిగిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో షింజో అబే ప్రధానిగా కొనసాగకపోవడం అనేది అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.