Snake In Airasia: ఎయిర్ ఏషియా విమానంలో పాము కలకలం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Snake In Airasia: మలేషియాలోని ఎయిర్ ఏషియాకు చెందిన విమానంలో పాము కలకలం సృష్టించింది. లగేజీ ర్యాక్ లో ప్రయాణికులకు కంటబడిన పాము.. చాలా సమయం పాటు ప్రయాణికుల్లో భయాందోళనలను నెలకొల్పింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదే విషయమై సదరు విమానయాన సంస్థ విచారణకు ఆదేశించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 16, 2022, 01:22 PM IST
    • ఎయిర్ ఏషియా విమానంలో పాము కలకలం
    • భయాందోళనలతో కేకలు పెట్టిన ప్రయాణికులు
    • మార్గమధ్యంలో విమానం అత్యవసరం ల్యాండింగ్
Snake In Airasia: ఎయిర్ ఏషియా విమానంలో పాము కలకలం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Snake In Airasia: మీరు విమానంలో ప్రయాణిస్తున్న క్రమంలో మీతో పాటు ప్రాణాంతక జంతువు ఉంటే మీ ఫీలింగ్ ఏంటి? అది కూడా ఓ పాము అయితే అందులో ప్రయాణించే వారి సంగతి ఏంటి? ఇలాంటి సంఘటన ఒకటి మలేషియాలో జరిగింది. ఎయిర్ ఏషియా విమానంలో అనుకోకుండా ఓ పాము దూరింది. విమానంలో కొన్ని వేల అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత అది ప్రయాణికుల కంట పడింది. ఇక అంతే.. దాన్ని చూసిన ప్రయాణికులు భయాందోళనలకు లోనయ్యి.. కేకలు పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందో మీరే చూసేయండి. 

ఏం జరిగిందంటే?

మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానంలోకి అనుకోకుండా ఓ పాము దూరింది. అయితే విమానం ప్రయణిస్తున్న క్రమంలో అది లగేజ్ ర్యాక్ నుంచి బయటకు వచ్చింది. దాంతో పాటు అందులోని పలు ప్రదేశాల్లో సంచరిస్తూ ప్రయాణికులకు కనబడింది. దాంతో ఒక్కసారిగా ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అది గమనించిన అటెండర్ ఎవరూ భయాందోళనలకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ పాము నుంచి దూరంగా సురక్షితంగా ఉండాలని సూచించారు. 

వెంటనే ఆ విషయాన్ని పైలట్ కు తెలియజేయగా.. ప్రయాణికుల భద్రత కోసం విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలకు లక్షల్లో వ్యూస్ లభిస్తున్నాయి. దీనిపై కొందరు నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. "విమానంలో పాము! అదేమైనా పెంపుడు జంతువా.. విమానంలో తీసుకెళ్లడానికి?" అని కామెంట్ చేశారు.  

ఎయిర్ ఏషియా ప్రకటన

ఇదే విషయమై సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా స్పందించింది. AirAsia Airbus A320-200 లోకి పాము దూరినట్లు మాకు మీడియా ద్వారా తెలిసిందని సేఫ్టీ ఆఫీసర్ కెప్టెన్ లియోంగ్ టియెన్ లింగ్ మాట్లాడారు. "ఈ విషయం మా ఎయిర్ లైన్ కంపెనీకి తెలిసింది. కౌలాలంపూర్ నుంచి తవౌ వెళ్లే విమానంలో ఈ పాము కనిపించింది. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇదే అంశంపై విచారణకు ఆదేశిస్తున్నాం" అని ఆయన అన్నారు. 

విచారణకు ఆదేశం

అయితే అంతటి విమానంలోకి పాము ఎలా దూరింది? ఎవరైనా విమానం లోపలికి తీసుకవచ్చారా? లేదంటే అదే ఏదైనా ద్వారం నుంచి ప్రవేశించిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి అనుమానలపై స్పష్టత కోసం ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అది పూర్తయ్యాక మిగిలిన వివరాలను బయట పెడతామని ఎయిర్ ఏషియా సంస్థ పేర్కొంది.   

Also Read: World Radio Day: నేడు వరల్డ్​ రేడియో డే- ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Also Read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News