World Radio Day: నేడు వరల్డ్ రేడియో డే. ఈ సందర్భంగా రేడియో ఎలా వచ్చింది. 20వ శాతాబ్దం ప్రారంభంలో రేడియో ఆదరణ ఎంతలా ఉండేది. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మాస్ మీడియా రంగం తొలుత ప్రింట్ మీడియంతో ప్రారంభమైంది. చాలా ఏళ్లు ప్రింట్ మీడియా ద్వారానే వార్తలు తెలిసేవి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. శాస్త్రవేత్తలు ధ్వని తరంగాల ద్వారా వార్తలను ప్రసారం చేయడం ప్రారంభించారు. ఈ ప్రయత్నాలే రేడియో ఆవిష్కరణకు తొలి అడుగులు.
రేడియా ఎప్పుడొచ్చిందంటే..
చరిత్రను పరిశీలిస్తే.. 19వ శతాబ్దం మధ్యకాలంలో రేడియో అందుబాటులోకి వచ్చింది. నిర్ధిష్ట బ్యాండ్ విడ్త్‌కు ధ్వని తరంగాలను ప్రసారం చేసేందుకు ఉపయోగపడుతుంది.
ఇక మన దేశం విషయానికొస్తే.. 20వ శాతాబ్దం తొలి నాళ్లలో రేడియో అందుబాటులోకి వచ్చింది. అయితే రేడియో ప్రధాన వార్తా ప్రసార మధ్యమంగా అవతరించేందుకు చాలా ఏళ్లు పట్టింది.
రేడియో డే ప్రాముఖ్యత..
చదువులేని వారికి సమాచారాన్ని సులభంగా చేరవేసేందుకు గానూ రేడియోలలో వార్తలు ప్రసారం చేయడం ప్రారంభించారు. దీనితో వార్తా పత్రికలు చదవలేని వారు, ధ్వని రూపంలో వార్తలను వినడం ద్వారా విషయాలను అర్థం చేసుకోవడం పెరిగిపోయింది. ఈ మాధ్యమం వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడా ఫిబ్రవరి 13న వరల్డ్ రేడియో డేను జరుపుకుంటున్నాం.
యునెస్కో 36వ కాన్ఫరెన్స్ సందర్భంగా 2011లో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 2012 ఫిబ్రవరిలో తొలిసారి వరల్డ్ రేడియో డే ప్రారంభమైంది.
ప్రస్తుతం రేడియో ప్రాముఖ్యత..
అధునాతన సాంకేతికతతో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోను రేడియో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభం సమయంలో ఎన్నో నకిలీ వార్తలు ఇంటర్నెట్లో వివరించగా.. రేడియోలో విశ్వసనీయమైన వార్తలను మాత్రమే ప్రసారం చేశాయి. దీనితో పాటు ప్రస్తుతం కమ్యునిటీ రేడియో వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది.
2022కు సంబంధించి.. 'రేడియో అండ్ ట్రస్ట్' అనే థీమ్‌తో ఈ సారి రేడియే డేని జరపాలని నిర్ణయించారు.
Also read: ఉక్రెయిన్‌పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. పుతిన్‌కు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్..
Also read: Corona end: ఈ ఏడాది చివరి నాటికి కరోనా తీవ్రమైన దశ అంతం: డబ్ల్యూహెచ్ఓ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook