Snow leopards Corona: కరోనాతో మంచు చిరుతలు మృతి...ఎక్కడంటే...

అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లింకన్​ చిల్డ్రన్​ జూలో కరోనాతో మూడు మంచు చిరుతలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 06:41 PM IST
Snow leopards Corona: కరోనాతో మంచు చిరుతలు మృతి...ఎక్కడంటే...

Three snow leopards die of COVID-19: కరోనా మనుషులనే కాదు..జంతువులను సైతం వదలట్లేదు. తాజాగా కొవిడ్(COVID-19)తో మూడు మంచు చిరుతలు(snow leopards) మృతి చెందాయి. ఈ ఘటన అమెరికాలోని నెబ్రస్కా లింకన్ చిల్డ్రన్ జూ పార్కు(Nebraska Lincoln Children's Zoo)లో జరిగింది. ఈ మేరకు జూ నిర్వాహకులు అధికారిక ఫేస్​బుక్ పేజీలో వెల్లడించారు.

గత నెలలో రెండు సింహాలకు, మూడు మంచు చిరుతలకు (snow leoprd died of corona) కరోనా సోకింది. చికిత్సలో సింహాలు కోలుకున్నాయి. కానీ చిరుతలు వైరస్​ ప్రభావం నుంచి బయటపడలేకపోయాయని 'జూ' యాజమాన్యం వెల్లడించింది. 

Also Read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు!

మనుషుల నుంచి జంతువులకు కరోనా వైరస్(CoronaVirus)​ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పర్యటకులను అనుమతించినట్లు వెల్లడించారు. అమెరికా(America)లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఈ క్రమంలో పలు 'జూ'లు కూడా వైరస్​ బెడదను ఎదుర్కొంటున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News