Nirav modi: ఆర్ధిక నేరగాడు నీరవ్ మోదీ త్వరలో ఇండియాకు, అంగీకరించిన లండన్ న్యాయస్థానం

Nirav modi: దేశంలో బ్యాంకుల్ని నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇక ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. లండన్ కోర్టులో అతడికి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోదీని బారత్‌కు తీసుకెళ్లేందుకు లండన్ న్యాయస్థానం అంగీకరించింది.

Last Updated : Feb 25, 2021, 06:18 PM IST
  • బ్యాంకుల్నించి 13 వేల 7 వందల కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్ధిక నేరగాడు నీరవ్ మోదీ
  • పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ భారత్‌కు వచ్చేందుకు మార్గం సుగమం
  • నీరవ్ మోదీపై మనీ లాండరింగ్ అభియోగాలు రుజువైనందున ఇండియాకు తరలించేందుకు అనుమతిచ్చిన లండన్ కోర్టు
Nirav modi: ఆర్ధిక నేరగాడు నీరవ్ మోదీ త్వరలో ఇండియాకు, అంగీకరించిన లండన్ న్యాయస్థానం

Nirav modi: దేశంలో బ్యాంకుల్ని నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇక ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. లండన్ కోర్టులో అతడికి ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ మోదీని బారత్‌కు తీసుకెళ్లేందుకు లండన్ న్యాయస్థానం అంగీకరించింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్  కుంభకోణం ( Punjab national bank scam )కేసులో ప్రధాన నిందితుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ( Nirav modi). వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ ఇప్పుడు లండన్‌లో ఉంటున్నాడు. బ్యాంకులకు 13 వేల 7 వందల కోట్లు రుణం తీసుకుని ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయాడు నీరవ్ మోదీ. ఈ కేసులో ఈడీ ( Enforcement Directorate) అతడిపై కేసు నమోదు చేసింది. లండన్ నుంచి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో భారత ప్రభుత్వం( Indian government) సమర్పించిన ఆధారాలు సరైనవేనని లండన్ కోర్టు భావించింది. అంతేకాకుండా నీరవ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న వాదనను కోర్టు కొట్టివేసింది. బ్యాంకు ఉన్నతాధికారులతో  ఉన్న లింక్‌ను న్యాయస్థానం ధృవీకరించింది. బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకుల్ని మోసగించినట్టు నిరూపితమైందని తెలిపింది. భారత్‌కు తీసుకెళ్లేందుకు లండన్ న్యాయస్థానం ( London court) అంగీకరించింది.

నీరవ్ మోదీపై మనీ లాండరింగ్( Money laundering case) అభియోగాలు రుజువు కావడంతో లండన్ తీర్పు భారత్‌కు తరలించేందుకు అంగీకరిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే అప్పీలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. లండన్ కోర్టు తీర్పుతో ఆర్ధిక నేరగాడైన నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమమైంది. 

Also read: Mamata Banerjee: ఇంధన ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న నిరస

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News